iDreamPost
iDreamPost
గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా పొగాకు రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో పొగాకు రైతులు భారీగా లబ్ది పొందిన విషయం తెలిసిందే. పొగాకు కొనుగోళ్ళలో ప్రైవేటు కంపెనీల ఇష్టారాజ్యానికి కళ్లెం వేసి మార్క్ ఫెడ్ ద్వారా ప్రభుత్వమే మార్కెటింగ్‌లో జోక్యం చేసుకుని ప్రయివేటు కంపెనీలకు ధీటుగా కొనుగోళ్ళు చేయడంలో రైతులు గతంలో ఎన్నడు లేని విధంగా లబ్ది పొందారు.
ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా నాడు ఒంగోలులో పొగాకు రైతులను కలుసుకున్న జగన్ వారి దయనీయ స్థితికి చలించిపోయారు. తన ప్రభుత్వం రాగానే వారిని ఆదుకుంటాను అని భరోసా ఇచ్చారు. ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగానే ప్రభుత్వం తరుపున వారికి అండగా నిలబడి వారికి ఆర్ధిక భరోసా కలిపించి తనది రైతు పక్షపాత ప్రభుత్వం అని నిరూపించుకున్నారు.
ముఖ్యమంత్రి జగన్ నిర్ణయంతో పొగాకు రైతులతో పాటూ అనేకమంది నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే తాజాగా బీజేపీ నేత టుబాకో బోర్డు చైర్మన్ యడ్లపాటి రఘునాథ్ బాబు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పొగాకు కొనుగోళ్లలో ప్రభుత్వ చొరవతో మార్క్‌ఫెడ్ జోక్యం చేసుకోవడం వల్ల రైతులకు మంచి ధర లభించిందని దీనివల్ల రైతులకు సుమారు రూ.125 కోట్లు లాభం వచ్చిందని ముఖ్యమంత్రి తీసుకున్న చొరవకు కృతజ్ఞతలు అని చెప్పుకొచ్చారు. అలాగే కరోనా లాంటి మహామ్మరి సమయంలో కూడా సంక్షేమ పాలన అందించడంలో ముఖ్యమంత్రి జగన్ కి సాటి మరొకరు లేరనే అభిప్రాయాని కూడా పలువురు వ్యక్తపరిచారు .