Idream media
Idream media
ఆంధ్రపద్రేశ్‌లో ఇప్పటి వరకూ 58, 668 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో యాక్టివ్ కేసులు 32 వేలు మాత్రమే. ప్రభుత్వ చికిత్స అనంతరం 25 వేల మందికి పైగా కోలుకున్నారు. అయితే.. కేసుల సంఖ్య 50 వేలకు దాటడానికి 11 లక్షలకు పైగా టెస్టులు చేయడం ఓ కారణమైతే.. మరో కారణం పొరుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో ఏపీకి వలస రావడం. దానికి కారణం ఇక్కడ కరోనాకు సరైన చికిత్స అందుతుందని విపరీతంగా ప్రజల్లోకి వెళ్లడమే.
ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 37,162 మంది నుంచి శాంపిల్స్ సేకరించి కరోనా పరీక్షలు నిర్వహించారు. వారిలో 4,944 మందికి కరోనా నిర్ధారణ అయింది. సంఖ్యా పరంగా చూస్తే 5వేలకు చేరువలో కేసుల నమోదు ఆందోళకర విషయమే. కానీ.. టెస్టుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే మాత్రం పర్వాలేదనే సంకేతాలు ఇస్తున్నాయి. కరోనా లెక్క పూర్తిగా తేల్చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దూకుడు గా వెళ్తోంది. ఖర్చుకు వెనకాడకుండా లక్షల్లో పరీక్షలు చేసుకుంటూ పోతోంది.
ఏపీకి తరలి వస్తున్న ప్రజలు
కరోనా కట్టడికి సంబంధించి ఏపీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు దేశంలోనే అత్యధిక ఖ్యాతి పొందింది. స్వయానా ప్రధాన మంత్రి మోదీ ఫోన్ చేసి సీఎం జగన్ కు అభినందనలు తెలిపారు. ఇక్కడ అనుమానం ఉన్న ప్రతి వారినీ పరీక్ష చేయడం.. కోవిడ్ సెంటర్లలో సరైన వసతులు కల్పించడం, పౌష్టికాహారం అందించడం, ఓ ఐఏఎస్ అధికారి పర్యవేక్షణ ఉండడం.. అలాగే.. కోవిడ్ ఆస్పత్రుల పెంపు, వైద్య సిబ్బంది పెంపు, అవసరాన్ని బట్టి ఎప్పటికప్పుడు పడకల పెంపు.. వంటి చర్యలతో ఏపీలో కరోనాకు చక్కటి వైద్యం అందుతుందనే ధీమా అందరిలోనూ ఏర్పడింది. దీంతో పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భారీ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నారు. వారు, వీరు అని చూడకుండా ఏపీలో ఉన్న అందరికీ ప్రభుత్వం పరీక్షలు చేస్తోంది. దీంతో బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే.. ఎంత మందికైనా చికిత్స అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు అక్కడి ఏర్పాట్లు చూస్తే తెలుస్తుంది.
ఈ నెలాఖరు నాటికి తగ్గుముఖం
టెస్టింగ్, ట్రేసింగ్, ట్రాకింగ్, ఐసోలేషన్, చికిత్సకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. ఎక్కడికక్కడ పరీక్షలతో కరోనాను నిగ్గు తేలుస్తూ చికిత్స అందిస్తోంది. నమూనాలు తీసిన 24 గంటల్లోనే పరీక్ష ఫలితాలు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. 104 కాల్ సెంటర్‌కు ఫోన్ చేస్తే పరీక్ష నిర్వహణ, ఆస్పత్రుల్లో చికిత్సకు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో అవసరాన్ని బట్టి ఎక్కడికక్కడ కట్టడి, లాక్ డౌన్, కర్ఫ్యూ వంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో జులై చివరినాటికి కేసుల సంఖ్య తగ్గుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.