Idream media
Idream media
మహారాష్ట్రలోని లో జరిగిన ఇద్దరు సాధువుల హత్య ఘటన మరవకముందే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్ సహార్ లో మరో దారుణం జరిగింది. ఆలయం లో నివసిస్తున్న ఇద్దరు సాధువులను అతి కిరాతకంగా హత్య చేశారు. దొంగతనానికి వచ్చిన ఓ వ్యక్తిని సాధువు ఇద్దరూ అడ్డుకోవడంతో ఈ హత్య జరిగింది. మురళి అనే నిందితుడు ఇద్దరు సాధువులు జగదీష్ (55) షేర్ సింగ్(46) దేవాలయంలోనే హత్యచేశాడు. మద్యం మత్తులో ఈ దారుణానికి పాల్పడిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే దేవుడు కోరిక ప్రకారం ఇద్దరు పోలీసులకు చెప్పడం గమనార్హం.
ఇద్దరు సాధువుల ను హత్య చేసిన తర్వాత నిందితుడు అక్కడే ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. చేతిలో కత్తితో జగదీష్ ని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు సాధువులను మొదట కత్తితో పొడిచిన నిందితుడు ఆ తర్వాత కర్రతో కొట్టి చంపాడని బులంద్షహర్ ఎస్పి సంతోష్ కుమార్ తెలిపారు. కాగా గత పదిహేనేళ్లుగా జగదీష్ ఐదేళ్లుగా షేర్ సింగ్ దాసులు ఈ ఆలయం లోనే ఉంటున్నారు. హత్య ఘటనపై సీఎం ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఘటనపై సమగ్ర నివేదికను అందించాలని జిల్లా కలెక్టర్ ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు.