iDreamPost
iDreamPost
రెండు కిలోల గంజాయి, నాలుగు ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు, రూ. రూ. మూడు వేలు నగదు స్వాధీనం.
తాడిపత్రితో పాటు ఇతర జిల్లాల నుండీ సేకరించి కువైట్ కు టర్న్ పంపుతున్నట్లు వెల్లడి.
పేద, సామాన్య , మధ్యతరగతి వర్గాల ప్రజలకు అత్యాశ చూపి జీవితాలను బుగ్గిపాల్జేస్తున్న 12 మంది మట్కా నిర్వాహకులను తాడిపత్రి పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుండీ రెండు కిలోల గంజాయి, నాలుగు ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు, రూ. మూడు వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. తాడిపత్రితో పాటు ఇతర ప్రాంతాల నుండీ ఫోన్లలో మట్కా వ్యవహారాలు కొనసాగించి ఆ మొత్తాలను కువైట్ లోని ఓ వ్యక్తికి టర్న్ చేస్తున్నట్లు వెల్లడయ్యింది. ఆదివారం తాడిపత్రి డీఎస్పీ ఏ.శ్రీనివాసులు విలేకరుల సమావేశం నిర్వహించి ఇందుకు బంధించిన వివరాలను వెల్లడించారు.
నిందితుల వివరాలు…
1) బాలిరెడ్డి అశోక్ రెడ్డి, వయస్సు 28 సం,, గన్నేవారిపల్లి కాలని, తాడిపత్రి.
2) ఉదయగిరి మాబున్ని, వయస్సు 28 సం, ఓం శాంతి నగర్, తాడిపత్రి .
3) చుక్కలూరు చాంద్ బాషా, వయస్సు 32 సం.. నందలపాడు,తాడిపత్రి.
4). మకందర్ ఖాజా, వయస్సు 29 సం,
తాడిపత్రి
5). మెహత్తార్ దాదా పీర్ @ దాదా, వయస్సు 20 సం,, ఓంశాంతి నగర్, తాడిపతి టౌన్.
6), మెహతా షాషావలి @షాషా, వయస్సు 22 సం, తాడిపత్రి
7). దిగువపల్లి సుబ్బారాయుడు,@ పుల్లయ్య, వయస్సు 65 సం.,తాడిపత్రి
8). పుట్లూరు పరమేశ్వర రెడ్డి, వయస్సు 24 సం,, శ్రీనివాసాపురం, తాడిపత్రి
9), అచ్చుకట్ల మస్తాన్ @ రోషన్, వయస్సు 21 సం, పడమటిగేరీ, తాడిపత్రి టిన్.
10), మకందర్ షేకున్ బీ, వయస్సు 50 సం, ఓం శాంతి నగర్, తాడిపత్రి.
11).కోన రంగనాయకులు, వయస్సు 17 సం,, గన్నెవారిపల్లి కాలనీ, తాడిపత్రి
12).వలిపిరెడ్డి నరేంద్ర నాథ రెడ్డి, వయస్సు 38 సం,, గన్నేవారిపల్లి కాలనీ, తాడిపత్రి
స్వాధీనం చేసుకున్నవి:
1). రెండు కిలోల గంజాయి
2). ఒక బుల్లెట్, ఒక హోండా CB Trigger, రెండు స్కూటిలు ( మొత్తం నాలుగు వాహనాలు)
3). 11 సెల్ ఫోన్లు
4). నగదు రూ. 3,000/-
నేపథ్యం…
ప్రస్తుతం అరెస్టయిన 12 మంది నిందితులు ముఖ్యులే. వీరిలో మకందర్ ఖాజా చాలా కీలకమైన వాడు. ఇతనిపై వివిధ స్టేషన్లలో12 కేసులున్నాయి. ఇతనితో పాటు అశోక్ రెడ్డిపై 9 కేసులు, మాబున్నిపై 2, చుక్కలూరు చాంద్ బాషాపై 7 , సుబ్బరాయుడిపై 2, పరమేశ్వరరెడ్డిపై 2, షేక్ మస్తాన్ వలీ 1 , కోన రంగనాయకులపై రెండు కేసులున్నాయి. వీరంతా గత కొన్నేళ్లుగా మట్కా నిర్వహిస్తున్నారు. మట్కా నంబర్ తగిలితే రూపాయికి 90 లేదా 80 ఇస్తామని మోసం చేస్తున్నారు. తాడిపత్రితో పాటు కర్నూలు, ప్రొద్దటూరు ప్రాంతాల నుండీ కూడా ఫోన్లలో మట్కా వ్యవహారాలను ఫోన్లలో సేకరించి ఆ మొత్తాలను కువైట్ లో ఉన్న వ్యక్తికి ఫోన్ ద్వారా టర్న్ చేస్తున్నారు. మట్కాతో పాటు వీరు గంజాయి కూడా విక్రయిస్తున్నారు.
అరెస్టు ఇలా… జిల్లాలో మట్కాపై ఉక్కుపాదం మోపాలని, కూకటి వేళ్లతో పెకలించాలని జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు సంకల్పించారు. ఇందులో భాగంగానే… తాడిపత్రి డీఎస్పీ ఏ.శ్రీనివాసులు పర్యవేక్షణలో … తాడిపత్రి పట్టణ సి.ఐ తేజమూర్తి, తాడిపత్రి రూరల్ సి.ఐ జి.వెంకటేశ్వర్లు, పట్టణ ఎస్ ఐ లు S G. ఖాజాహుస్సైన్, M. ప్రదీప్ కుమార్, K.వెంకటలక్ష్మమ్మ మరియు తాడిపత్రి రూరల్ ఎస్ ఐ N. రాజశేఖర్, పుట్లూరు SI U. వెంకట ప్రసాద్, మరియు వారి సిబ్బంది ASI C.నాగన్న, He’s బి. శివయ్య, వి.చంద్రశేఖర్, సి.లక్ష్మయ్య, N.రఘునాథ్, బి. చత్రు నాయక్, మరియు PCS షెక్షావలి, M. బాబా ఫక్రుద్దీన్, J.నరసింహులు, గోవిందు, టి.రవికుమార్, వి.శీను నాయక్, C.జగధీశ్వర రెడ్డి , P. అంకన్న మహిళా సిబ్బంది వెంకట లక్ష్మి హాంగార్డ్ షహినాలు ప్రత్యేక బృందంగా వెళ్లి ఆదివారం తాడిపత్రిలోని గాంధీ కట్ట సమీపంలో అరెస్టు చేశారు.
ప్రశంస… తాడిపత్రిలో వేళ్లూనుకున్న మట్కాను పెకలించే క్రమంలో 12 మందిని అరెస్టు చేసిన తాడిపత్రి డీఎస్పీ ఏ.శ్రీనివాసులు, సి.ఐ తేజోమూర్తి మరియు ఎస్ ఐ ల నేతృత్వంలో బృందాన్ని జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు అభినందించారు.