ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో రాయలసీమ నేతలు కొత్త వాదన తెరపైకి తెచ్చారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు స్వాగతిస్తున్నట్లు చెబుతూనే అది మాత్రమే రాయలసీమ కు సరిపోదని చెబుతున్నారు బిజెపి నేత రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని తెరమీదకు తీసుకు వచ్చి అక్కడ రెండో రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది రాయలసీమ హక్కుల ఐక్య వేదిక తరుపున తామే అన్నారు.
ఇప్పుడు రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో మినీ అసెంబ్లీ భవనాలను ఏర్పాటు చేయాలన్నారు. ఒక హైకోర్టుతో సరి పెట్టకుండా మినీ అసెంబ్లీ , మినీ సెక్రటేరియట్ రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటు చేయాలన్నారు. ప్రాంతాల మధ్య దూరాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని ప్రాంతాల్లో అన్ని విభాగాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.