iDreamPost
iDreamPost
రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఇంకా పలువురు ప్రముఖులను హతమార్చేందుకు ఒక ఉగ్రవాద సంస్థ కుట్రపన్నింది. ఈ మేరకు ఉగ్రవాద సంస్థ నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)కు ఒక బెదిరింపు లేఖ అందింది. హిట్ లిస్టులో బీజేపీ వృద్ధ నేత ఎల్‌కే ఆడ్వాణీ, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్లు కూడా ఉన్నాయని తెలిసింది. ఆలిండియా లష్కరే తయబా హైపవర్ కమిటీ(కోజికోడ్) నుంచి వచ్చినట్లు చెబుతున్న లేఖ నేపథ్యంలో ఆయా ప్రముఖులకు భద్రతను పటిష్ఠం చేశారు.