iDreamPost
iDreamPost
తెలుగుదేశం పార్టీకి ఇటీవలి పరిణామాలు మింగుడుపడడం లేదు. చంద్రబాబు ఎంత ప్రయత్నం చేసినా కేంద్రంలోని ఇద్దరు కీలక నేతలు కరుణించడం లేదు. గడ్కరీ ఆశీస్సులున్నాయని సంతృప్తి పడుతున్నా అమిత్ షా- మోడీ ద్వయం ఏం చేస్తారోననే ఆందోళన వెంటాడుతోంది. సరిగ్గా అదే సమయంలో జగన్ వ్యూహాత్మక అడుగులు మింగుడుపడడం లేదు. నేరుగా కేంద్రంలోని పెద్దల ఆశీస్సులుండడంతో అన్ని రకాలుగా చంద్రబాబుని చిక్కుల్లో నెట్టే యత్నం సాగుతోంది. ఇప్పటికే పాలనా వికేంద్రీకరణ బిల్లుతో టీడీపీ తల్లడిల్లిపోతోంది. రేపు అమూల్ కంపెనీ ఒప్పందంతో పాల వ్యాపారం పెరిగితే హెరిటేజ్ కి సెగ తప్పదని అంతా భావిస్తున్నారు. అదే సమయంలో గత ఐదేళ్లలో సాగించిన అక్రమాలపై విచారణకు పూనుకోవడం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వరుసగా అమరావతి భూములు, పైబర్ గ్రిడ్ వ్యవహారం ఇప్పుడు పీకల మీదకు వస్తున్నట్టు స్పష్టమవుతోంది.
చంద్రబాబు కి ఊపిరిసలపనివ్వని స్థాయిలో జగన్ వ్యవహారం ఉండడంతో టీడీపీ శిబిరం సహించలేకపోతోంది. అనూహ్యంగా హస్తిన వెళ్లి అమిత్ షా తో రెండుసార్లు భేటీ కావడాన్ని జీర్ణిం చేసుకోలేని స్థితిలో ఉన్నారు. పిచ్చి రాతలతో కొన్ని పచ్చ పత్రికలు సంతృప్తి పడుతున్న తీరు పట్ల ప్రజల్లో అసహ్యం కనిపిస్తోంది. సోషల్ మీడియా సాక్షిగా ఆంధ్రజ్యోతి విష రాతలను జనం చీల్చిచెండాడుతున్న తీరు దానికి అద్దంపడుతోంది. తమకు నచ్చినట్టుగా కేంద్ర హోం శాఖతో ఏపీ సీఎం భేటీని వక్రీకరించ పూనుకోవడం పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. అదేసమయంలో కేంద్రం దృష్టికి కూడా పలువురు తీసుకెళ్లారు. అమిత్ షా కార్యాలయానికి ఫిర్యాదులు చేయడంతో జ్యోతి రాతలపై కేంద్ర హోం శాఖ ఎలా స్పందిస్తుందోననే చర్చ మొదలయ్యింది.
అదే సమయంలో కేంద్ర జలవనరుల శాఖతో జరిగిన సమావేశం అనంతరం మంత్రి స్వయంగా కారు వద్దకు వచ్చి జగన్ కి సెండాఫ్ చెప్పిన తీరు సీఎం వ్యతిరేకులకు మింగుడుపడే అవకాశం లేదు. అంతేగాకుండా జగన్ దూకుడు తట్టుకోగల పరిస్థితిలో వారు లేరని భావించవచ్చు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించి పోలవరం ప్రాజెక్ట్ నిధుల అంశంతో పాటుగా వివిధ కీలక విషయాల్లో జగన్ చొరవకి కేంద్రం స్పందిస్తున్న తీరుకి తల్లడిల్లిపోతున్నారు. ఇలాంటి సమయంలో రెండు రోజుల పాటు జగన్ జరిపిన బేటీలన్నీ సానుకూల ఫలితానివ్వడం వారికి సమస్యగా మారుతున్నట్టు కనిపిస్తోంది. ఏబీఎన్ తో పాటుగా టీవీ5లో వచ్చిన కథనాలు గమనిస్తుంటే ఉక్రోశం అర్థమవుతోంది. ఇప్పటికే కాగ్ తో ఆడిట్ చేయిస్తామని ప్రకటించగానే తిరుమల చుట్టూ వివాదాలు రాజేసిన టీడీపీ ఇప్పుడు ఏకంగా జగన్ పర్యటన ప్రజల దృష్టికి వెళ్లకుండా చేయాలనే దుగ్దతో ఏకంగా లోటస్ పాండ్ ముందు ఆందోళనకు స్కెచ్ వేసిన తీరు విస్మయకరంగా మారింది.
చంద్రబాబు తన 70ల నాటి కుయుక్తులను నేటి రాజకీయాల్లో అమలు చేస్తున్న తీరు చాలామందిని విస్మయానికి గురిచేస్తోంది. కానీ సీఎం జగన్ మాత్రం మౌనంగా తన పని తాను చేసుకుంటూ ప్రజలకు మరింత మేలు చేసే పథకాలకు శ్రీకారం చుట్టే దిశలో ఉన్నారు. తాజాగా వైఎస్సార్ జలసిరి పథకానికి ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తూ ఎన్నికల హామీలన్నీ అమలుచేసే దిశలో వెళుతున్నారు. అదే సమయంలో తిరుమల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీతో వీడియోకాన్ఫరెన్స్ లో సీఎం పాల్గొంటారు. దాంతో జగన్ వేగంగా ముందుకు సాగుతుంటే చంద్రబాబు నక్కజిత్తులతో నిలువరించే ప్రయత్నం చేస్తుండడమే వర్తమాన విచిత్రంగా చెప్పవచ్చు.