ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వ్యవహారం సీరియస్ గా మారింది. కు.ని ఆపరేషన్లలో నలుగురు మహిళలు చనిపోవడాన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.
ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు బుధవారం నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి ఇబ్రహీంపట్నం బాధితులను కలిశారు. ఆరేళ్లలో 12 లక్షల మందికి ఆపరేషన్లు చేసినా, ఎప్పుడూ ఇలా జరగలేదు. ఈ ఆపరేషన్లు చేసిన డాక్టర్ల లైసెన్స్‌లను రద్దు చేశాం. ఈ ఘటనపై కమిటీ నివేదిక అందగానే బాధ్యులపై చర్యలు తప్పవని మంత్రి స్పష్టం చేశారు.
చనిపోయిన మహిళల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం మిచ్చి, డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయిస్తాని చెప్పారు. బాధిత కుటుంబాలను అన్నిరకాలుగా ఆదుకొంటామని, బాధితులు కోలుకున్న వెంటనే అన్ని రకాల పరీక్షల తర్వాత ఇంటకి పంపిస్తామని చెప్పారు.
ప్రతిపక్షాలూ ఈ ఘటనపై సీరియస్ గా స్పందిస్తున్నాయి. జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పరామర్శించారు. గంటలో 34 మందికి ఎవరైనా ఆపరేషన్లు చేస్తారా? మహిళల ప్రాణాలతో ఆటుకుంటారా? ఆరోగ్య పరిస్థితి తెలుసుకోకుండా , ఆసుపత్రి గదిలో కింద పడుకోపెట్టి అంత తొందరగా ఆపరేషన్లు చేయాల్సిన అవసరం ఏముందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అపోలో ఆసుపత్రిలో 11 మంది, నిమ్స్‌లో 19 మంది చికిత్స పొందుతున్నారు.
బర్త్ డే పార్టీకి వచ్చిన రిచ్ మామ ఇంటికే కన్నం వేశాడో అల్లుడు. ఫ్రెండ్స్ తో కలసి మామ బంగారాన్ని దోచుకున్నాడు. సైదాబాద్, కుర్మగూడకు చెందిన యాసిర్ ఉల్లిఖాన్ 31న తన బర్త్ డేకి మామను పిలిచాడు. అతిధి మర్యాదలు చేశాడు. అల్లుడి బర్త్ డేకి మామ ఘనంగా వచ్చాడు. రింగ్ లు, చైన్, కాస్ట్లీ వాచ్ వేసుకున్న మామపై అల్లుడికి అసూయపుట్టింది. ఒంటిమీద ఇంతుంటే ఇంట్లో ఇంకెంత ఉండాలనుకొని మామ ఇంట్లో దొంగతనం చేయాలని ప్లాన్ […]