iDreamPost
android-app
ios-app

బీజేపీ నాలుగు క‌మిటీల వెనుక నూత‌న పంథా.!

బీజేపీ నాలుగు క‌మిటీల వెనుక నూత‌న పంథా.!

తెలంగాణలో ప్ర‌ధాన‌మైన గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలో పార్టీ విస్త‌ర‌ణ‌కు భారతీయ జనతా పార్టీ నూత‌న పంథా అనుస‌రిస్తోంది. పార్టీ ప‌రంగా జీహెచ్ ఎంసీని నాలుగు జిల్లాలుగా ఏర్పాటు చేసి.. న‌లుగురు సార‌థుల‌ను నియ‌మించేందుకు విభిన్న వ్యూహం ప‌న్నుతోంది. గ్రేట‌ర్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్ప‌టి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా నగర శివారు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించింది. నగరంతో పాటు శివారు జిల్లాల పరిధిలో ఉన్న ప్రాంతాలను కలిపి అర్బన్‌, రూరల్‌ విభాగాలుగా విభజించి వారం రోజుల్లో నూతన సారథులను ఎంపిక చేసేందు కు సన్నద్ధమవుతోంది. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా కమిటీ పరిధిలో ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఉప్పల్‌, మల్కాజ్‌గిరి, కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి, గ్రామీణ ప్రాంతమైన మేడ్చల్‌ నియోజవర్గాలు ఉండేవి. జీహెచ్‌ఎంసీ పరిధిలోని నాలుగు నియోజకవర్గాల ను మేడ్చల్‌ మల్కాజ్‌గిరి అర్బన్‌ జిల్లాగా పరిగణిస్తూ ప్రత్యేక కమిటీని, నాలుగు మునిసిపల్‌ కార్పొరేషన్లు, 9 మునిసిపాలిటీలు, 61 గ్రామపంచాయతీలతో మేడ్చల్‌ మల్కాజ్‌గిరి రూరల్‌ జిల్లా కమిటీని వేయాలని యోచిస్తోం ది.

అర్బ‌న్, రూర‌ల్ క‌మిటీలు

జీహెచ్‌ఎంసీ పరిధిలోని శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌, మహేశ్వరం, ఎల్‌బీనగర్‌, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలతో రంగారెడ్డి జిల్లా అర్బన్‌ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్‌, షాద్‌నగర్‌, కల్వకుర్తి(కొంతభాగం), చేవెళ్ల (కొంతభాగం) నియోజకవర్గాల్లోని మూడు మునిసిపల్‌ కార్పొరేషన్లు, 12 మునిసిపాలిటీలు, 560 గ్రామపంచాయతీలో రూరల్‌ కమిటీ ఏర్పాటు చేయనున్నా రు. వికారాబాద్‌ జిల్లా పూర్తిగా గ్రామీ ణ ప్రాంతంలో ఉండటంతో అక్కడ ఒకటే కమిటీని ఎన్నుకునే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్‌ను తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ప్రాంతాలుగా విభజించి నూతన కమిటీలను ఏర్పా టు చేసి, సారథులను ఎంపిక చేయ నున్నారని సమాచారం. పార్టీ అధిష్ఠానం ముఖ్యనేతలతో సమావేశాలు నిర్వహించి, నూతన కమిటీల ఎంపికపై కసరత్తు చేశారు. సీనియర్‌ నేతల అభిప్రాయలను కూడా తీసుకున్నారు.

కొత్త కేడ‌ర్ పెంచుకునేందుకు…

మరో కొన్ని రోజుల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఎలాగైనా గ్రేటర్‌పై కాషాయజెండా ఎగురవేయాలని పార్టీ చూస్తోంది. పార్టీకి నగరాల్లో బలమైన కేడర్‌ ఉంది. దీంతో పాటు కొత్త కేడర్‌ను పెంచుకుంటూ స్థానికంగా పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ఇంటింటి ప్రచారం చేయాలని, తర్వాత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మెజారిటీ డివి జన్లు కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు నూతన సారథులుగా స్థానం సంపాదించేందుకు ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.