ఆక్లాండ్ మ్యాచ్లో కివీస్ పై 200 పైగా పరుగుల ఛేదనను విజయవంతంగా నాలుగోసారి పూర్తిచేసి అత్యధికసార్లు ఈ ఘనత సాధించిన జట్టుగా భారత్ పేరిటే ఉన్న వరల్డ్ రికార్డును మెరుగుపరచుకుంది.
ఇప్పటివరకు టి 20 క్రికెట్ ఫార్మాట్‌లో నాలుగుసార్లు ఇలాంటి భారీ లక్ష్యాలను భారత్ చేధించింది. తొలిసారి 2009లో మొహాలీలో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్ విజయవంతంగా 211 పరుగుల లక్ష్యాన్ని ఛేధించింది.ఈ పొట్టి క్రికెట్ ఫార్మాట్‌లో భారత్‌కిదే అత్యధిక ఛేదన కావడం విశేషం.రెండోసారి 2013లో రాజ్‌కోట్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విధించిన 202 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఛేజ్ చేసింది.
Read Also: భారత్ విజయం
2019లో హైదరాబాద్ టి-20 మ్యాచ్‌లో వెస్టిండీస్ నిర్దేశించిన 207 పరుగుల టార్గెట్‌ను భారత్ ఛేదించడంతో,మూడోసారి 200 పైగా పరుగుల లక్ష్యఛేదన చేసి వరల్డ్ రికార్డును నెలకొల్పింది. నిన్నటి మ్యాచ్లో కివీస్‌పై తాజాగా 204 పరుగుల టార్గెట్ ను నాలుగోసారి ఛేదన చేసి తన పేరిట ఉన్న వరల్డ్ రికార్డును భారత్ మెరుగుపరచుకుంది.గత మూడు సందర్భాలలో సొంతగడ్డపై 200 పరుగులు పైగా లక్ష్యాలను భారత్ ఛేధించగా,తొలిసారి విదేశీ గడ్డపై భారత్ ఈ ఘనత సాధించడం విశేషం.
4211