iDreamPost
iDreamPost
2019 ఆగస్టులో వానలకు పంటలు మునిగిపోయాయని, వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని ఆస్కార్ లెవెల్లో నటించేశాడు పెయిడ్ ఆర్టిస్ట్ శేఖర్ చౌదరి. మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఎన్నికల సమయంలో టీడీపీ ప్రకటనల్లో కూడా నటించాడు ఈ యాక్టర్.. పోలీసులకు అడ్డంగా దొరికి శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లాడు.
10 రోజుల కిందట పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం గుమ్ములూరులో టీడీపీ ఎమ్మెల్యేలు మంతెన రామరాజు, నిమ్మల రామానాయుడు తదితరులు రోడ్లు సరిగ్గా లేవంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ముగ్గురు యువకులు బైక్ పై వెళ్తుండగా.. గుంతల్లో పడిపోయి గాయపడ్డారంట. తలకు, చేతులకు కట్లు ఉన్న ముగ్గురు యువకులను చూపెట్టారు. అంతా బాగుంది.. నిరసన పూర్తయింది.. దెబ్బలు తగిలాయని ఎమ్మెల్యేలు చెప్పిన యువకులు పక్కకు వెళ్లి కట్లు ఊడదేశారు. స్థానికులు ఫొటోలు, వీడియోలు తీసి మీడియాకు పంపారు.. నాటకం బయటపడింది.
ఇప్పుడు మళ్లీ మరో డ్రామా ఆడారు టీడీపీ నేతలు.. స్థలం మారింది.. అంశం మారింది. డ్రామా మాత్రం సేమ్ టు సేమ్.. ఈ సారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ సైకిల్ ర్యాలీ చేపట్టారు. లొకేషన్ ఒంగోలు.. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలతో చేపట్టిన ఈ సైకిల్ ర్యాలీకి కింది స్థాయి లీడర్లు ఎవరూ హాజరుకాలేదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ర్యాలీ చేయడానికి సైకిళ్లు లేవు.. వచ్చిన 15 మంది లీడర్లు కూడా కార్లు, బైకుల్లో వచ్చారు. దీంతో అక్కడక్కడ సైకిళ్లు ఉన్న పిల్లల్ని తీసుకుని వచ్చారు. అంతటితో ఆగలేదు.. పిల్లలకు పచ్చ కండువాలు, జెండాలు కూడా ఇచ్చారు. ఆ 15 మంది లీడర్లు, కొందరు పిల్లలు కలిసి పాత గుంటూరు రోడ్డులోని పార్టీ ఆఫీసు నుంచి ర్యాలీగా బయలుదేరారు.
అయితే టీడీపీ నాయకులను దారిలోనే అడ్డుకున్నారు ఒంగోలు డీఎస్పీ. చదువుకునే పిల్లలతో సైకిల్ ర్యాలీ ఏంటంటూ టీడీపీ నేతలను నిలదీశారు. దీంతో ఏం సమాధానం చెప్పలేదు టీడీపీ నేతలు. పిల్లల్ని పంపేశారు. సైకిళ్లు వెళ్లిపోయాయి. చివరికి మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ దగ్గర ఒక సైకిల్ మాత్రమే మిగిలింది. అయినా ర్యాలీగా వెళ్దామని భావించారు. కానీ అనుమతి లేదంటూ లీడర్లను కూడా డీఎస్పీ వెనక్కి పంపారు. నిరసన అలా మధ్యలోనే ముగిసిందన్నమాట. ఈ మొత్తం వ్యవహారంలో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ర్యాలీకి సైకిల్ తో వచ్చిన పిల్లలకు రూ.300 ఇస్తామని చెప్పి తీసుకొచ్చారట. ఎంత కష్టమొచ్చింది సామీ మీకు!!