‘రేయ్…………నా కొడకా……..?’………ఈ వాక్యాన్ని మీడియాలో ప్రచురించడం ఎంతవరకూ కరెక్ట్ అంటే కూడా సమర్థించుకోవడం కష్టమే. కానీ అత్యంత దుర్మార్గ, నీచ రాజకీయాల గురించి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా అన్న ప్రశ్నకు సమాధానంగా రాయాల్సిన పరిస్థితి. పైన ప్రస్తావించిన వాక్యాన్ని గత ఐదేళ్ళకాలంలో ఆఫ్ ది రికార్డ్, ఆన్ రికార్డ్‌గా టిడిపి నాయకులు ఎన్నిసార్లు ఉపయోగించారో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. సాక్షాత్తూ అసెంబ్లీలోనే ఒక టిడిపి సీనియర్ నాయకుడు, బాధ్యతగల ప్రజాప్రతినిధి…….అన్నింటికీ మించి ప్రపంచానికి పాఠాలు చెప్పానని చెప్పుకునే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ బాబుగోరి శిష్యులుంగారు ఘనంగా, తెలుగు వారందరికీ రీసౌండ్ స్థాయిలో వినపడేలా ప్రస్తావించారు. ఇక జేసీ దివాకరరెడ్డి లాంటి సీనియర్ నాయకులు కూడా బాబును సంతుష్టుడిని చేయడం కోసం విరివిగా ఉపయోగించారు. ఇక జేసీ సోదరుడు ప్రభాకరరెడ్డి అయితే మనిషినన్న విషయం కూడా మర్చిపోయి మాట్లాడేశారు.
అత్యంత విషాదరకరమైన విషయం ఏంటంటే పొద్దున్న లేస్తే సంస్కారం, హుందాతనం, నీతి, నిజాయితీతో కూడిన రాజకీయాలు అంటూ డప్పు కొట్టుకుంటూ ఉండే చంద్రబాబు నాయుడుగారి సంతోషం కోసమే ఈ నాయకులందరూ ఈ స్థాయి నీచమైన రాజకీయాలు చేశారని చెప్పడానికి సందేహించక్కర్లేదు. ఎందుకంటే పైన చెప్పిన వాక్యంతో పాటు ఇంకా చాలా బూతులను టిడిపి నాయకులు ఉపయోగిస్తూ ఉంటే అదే అసెంబ్లీలో, ఇంకా చాలా సభలలో చంద్రబాబునాయుడు అదో రకమైన నవ్వులు రువ్వుతూ ఎంజాయ్ చేశారు. అప్పట్లో ఇదే చంద్రబాబు వెన్నుపోటు తర్వాత ఎపిసోడ్‌లో ఎన్టీఆర్‌కి విలువలు లేవు అని చెప్పి నానా మాటలూ అన్నారు. అలాగే ఈనాడుతో సహా పచ్చ మీడియాలో వృద్ధుడు అయిన ఎన్టీఆర్ ఫొటోలను, కార్టూన్స్‌ని దారుణమైన బూతు అర్థాలు ధ్వనించేలా ప్రచారం చేయించాడు. 2014 ఎన్నికల సమయంలో జగన్‌ని ఎదుర్కోలేక జగన్‌ని చెల్లెలు వైఎస్ షర్మిళ వ్యక్తిత్వాన్ని దారుణంగా హననం చేస్తూ పచ్చ బ్యాచ్ చేసిన నీచ రాజకీయం గురించి ఎంత విమర్శించినా తక్కువే.
ఇక ప్రస్తుతానికి వస్తే అదే బూతు ట్రీట్మెంట్‌ని ఇప్పుడు టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అదే టిడిపి అధినేతతో పాటు ఆ పార్టీ సీనియర్ నాయకుడు అయిన బాబు రాజేంద్రప్రసాద్‌కి కూడా ఇచ్చాడు. వాళ్ళూ వీళ్ళూ అని ప్రత్యేకంగా చూడకుండా చంద్రబాబు నుంచి ఆయన సలహాదారు ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణలను కూడా మీడియా సమావేశంలో ఆడేసుకున్న వంశీ…..ఆ తర్వాత ఒక మీడియా చర్చలో భాగంగా ఓ స్థాయిలో రెచ్చిపోయి టిడిపి సీనియర్ నాయకుడు బాబూ రాజేంద్రప్రసాద్ సమక్షంలోనే పిచ్చి పిచ్చిగా తిట్టిపోశాడు. అఫ్కోర్స్ రాజేంద్రప్రసాద్ కూడా అదే స్థాయి తిట్ల వర్షం కురిపించడంలో వంశీకి ఏ మాత్రం తగ్గలేదనుకోండి. తన బూతుల పరంపరను కంటిన్యూ చేసిన వంశీ ఆ తర్వాత చంద్రబాబు, లోకేష్‌లు జీవితంలో మర్చిపోలేని స్థాయిలో దారుణమైన కామెంట్స్ చేశాడు. చంద్రబాబు యూజ్ అండ్ త్రో పాలసీ రాజకీయాలు, దారుణమైన కుట్రలతో వ్యక్తిత్వ హననానికి పాల్పడే రాజకీయాలతో స్వయంగా టిడిపి నాయకులే ఏ స్థాయిలో భయాందోళనకు గురవుతున్నారో వంశీ ఎపిసోడ్ తెలియచేస్తోంది. అయితే ఇక్కడ వల్లభనేని వంశీని కూడా ఎవ్వరూ సమర్థించడం లేదు. వంశీ చేసిన విమర్శల విషయం పక్కన పెడితే వాడిన భాష మాత్రం కచ్చితంగా ఆక్షేపణీయం. రాజకీయాలు ఎప్పుడూ హుందాగా ఉండాలి. నాయకులు ఆదర్శవంతంగా ఉంటేనే ఆ సమాజంలో ఉన్న ప్రజలు గుండెల మీద చేయి వేసుకుని ప్రశాంతంగా జీవించే పరిస్థితులు ఉంటాయి. అదే నాయకులు మరీ వీధి రౌడీల స్థాయిలో రెచ్చిపోతూ ఉంటే సామాన్య ప్రజలు ఆందోళనకు గురవుతారనడంలో సందేహం లేదు.
అయితే ఈ మొత్తం పరిణామాలను పరిశీలిస్తున్న జర్నలిస్టులు, విశ్లేషకులు మాత్రం వేళ్ళన్నీ కూడా చంద్రబాబు వైపు చూపిస్తున్నారు. నేను హైటెక్ నాయకుడిని, ఎడ్యుకేటెడ్ లీడర్‌ని, గొప్పవాళ్ళకే గొప్పవాడిని, దేశంలోనే సీనియర్‌ని, నీతి,నిజాయితీతో కూడిన రాజకీయాలు చేశాను, నిప్పులా బ్రతికాను అని అస్తమానం చెప్పుకునే చంద్రబాబు ఒరిజినల్ రాజకీయాలు ఇవా అని ఆలోచనపరులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్షనిస్టులు, దుర్మార్గపు రాజకీయాలు అని ప్రత్యుర్థులను తిట్టిపోసే చంద్రబాబు తన అనుచరులు, శిష్యులు అయిన నాయకుల చేత చేయించే రాజకీయాలు ఇలా ఉంటాయా అని మాట్లాడుకుంటున్నారు. మా చంద్రబాబు గొప్పోడు అన్న పచ్చ మీడియా భజనను పక్కనపెట్టి చూస్తే తెలుగునాట రాజకీయాలను, ఆ రాజకీయాల్లో బూతులను మరీ సీ గ్రేడ్ స్థాయికి దిగజార్చిన నాయకుడు ఎవరో ప్రజలకు ఇట్టే అర్థమైపోతుందని ఒక సీనియర్ పత్రికా సంపాదకుడు చంద్రబాబు రాజకీయాలను ఉద్ధేశ్యించి ఆవేదన వ్యక్తం చేయడం పరిస్థితికి అద్దం పడుతోంది.
చంద్రబాబు ట్రేడ్ మార్క్ రాజకీయాల్లో ఇంకో కుట్ర తరహా రాజకీయం ఏంటంటే అవతలిపార్టీ నుంచి ఏ కులం నాయకుడు విమర్శిస్తే టిడిపిలో ఉన్న అదే కులం నాయకుడితో ప్రతివిమర్శలు చేయడం. అలా కుల రాజకీయాలను అత్యంత ఎక్కువగా వాడుకున్న నాయకుడు, కుల విభేదాలను రాజకీయం కోసం వాడుకున్న నాయకుడు చంద్రబాబు. చంద్రబాబు భజన కోసమే బ్రతికున్నాను అనే స్థాయిలో మీడియా సంస్థను నడుపుతున్న ఒక సంపాదకుడు కూడా ఎప్పుడూ టిడిపికి ఉపయోగపడేలా కుల చిచ్చుపెట్టే రాతలే రాస్తూ ఉంటారు. అఫ్కోర్స్ ఇప్పుడు ఏకంగా జగన్‌కి హిందూ మతవ్యతిరేకి ముద్ర వేయాలని చంద్రబాబుతో సహా పచ్చ మీడియా అధినేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారనుకోండి. అయితే ఇక్కడ ఆశ్ఛర్యం కలిగించే ఒక విషయం ఏంటంటే వల్లభనేని వంశీలాంటి సొంత కులం నాయకుడు బాబు, లోకేష్, ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కేలను ఓ స్థాయిలో ఏకిపారేస్తే మాత్రం చంద్రబాబు గతంలో లాగ అదే సామాజిక వర్గ నేతలతో ఎదురుదాడికి చేపియ్యకుండ వర్ల రామయ్యలాంటి ఎస్సీ నేతతో వంశీకి కౌంటర్ ఇప్పిస్తున్నారు. ఇలాంటి రాజకీయాలతోనే తెలంగాణాలో పూర్తిగా టిడిపిని పాతేసిన చంద్రబాబు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అదే పాతాళానికి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడని ఎన్టీఆర్ కాలం నాటి టిడిపి అభిమానులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబులో ఎప్పుడు మార్పు వస్తుందో…..అసలు వస్తుందో రాదో చూడాలి మరి.