విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తెలుగుదేశం శాసన సభ్యులు గంటా శ్రీనీవాస్ రాజీనామ చేశారు. పార్టీలతో సంబంధం లేకుండా ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం రాజీనామాలు చేయాలని ఒక ప్రకటన విడుదల చేశారు. తన రాజీనామా పత్రాన్ని స్వయంగా తానే రాసి ఆ లేఖను స్పీకర్ కు పంపారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం తాను రాజీనామా చేస్తున్నట్టు, స్టీల్ ప్లాంట్ కాపాడుకునేందుకు నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చెయబోతునట్టు గంటా ప్రకటించారు.
గత కొద్దికాలంగా రాజకీయాలకు, టీడీపీ పార్టీకు దూరంగా ఉంటూ వస్తున్న గంటా శ్రీనివాస్ స్టీల్ ప్లాంట్ పేరున రాజీనామా చేయడం, నాన్ పోలిటికల్ జేఏసీ ఏర్పాటు చేస్తా అని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.