Idream media
Idream media
అభివృద్ధి, సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరూ ఊహించని స్పీడులో దూసుకెళ్తోంది.. జగన్ దూకుడు చూసి ప్రతిపక్షాలకు మైండ్ బ్లాక్ అవుతోంది. ప్రజల కోసం ఇంత ఖర్చు ఎలా చేయగలుతున్నారో.. వారికి అర్థం కావడం లేదు. జగన్ ప్రణాళికలు, ఉన్నతాధికారులతో కలిసి తీసుకుంటున్న ఆర్థిక విధానాల కారణంగా ప్రభుత్వం ఎక్కడా ఏ వర్గాలకూ లోటు లేకుండా చేస్తోంది. దీంతో తెలుగుదేశం పార్టీ నాయకులకు కంటి వింపు కావడం లేదు. దీంతో రాష్ట్రం ఆదాయం, అప్పులపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఈ విషయంలో సుదీర్ఘ కాలం పాటు ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక మంత్రిగా పని చేసిన టీడీపీ నేత యనమల రామకృష్ణుడు తన చాణుక్యత ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రానికి పన్నుల ద్వారా రూ.67 వేల కోట్లు వచ్చాయని ఇటీవల ఆయన ప్రకటించారు. కానీ.. దీంట్లో ఎంత మాత్రమూ వాస్తవం లేదు. ఆయన ఎలా ఆ లెక్కలను అంచనా వేసారో చెప్పగలరా..? అని ప్రభుత్వం ప్రశ్నించినప్పుడు యనమల సరైన సమాధానం చెప్పలేకపోవడమే దీనికి కారణం. నిజానికి పన్నుల ద్వారా రాష్ట్రానికి వచ్చిన ఆదాయం రూ.62,473 కోట్లు. కేంద్రం నుంచి మరో రూ.52 వేల కోట్లు వచ్చాయి. అన్నీ కలుపుకుంటే ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన ఆదాయం రూ.1,14,772 కోట్లు. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి బుగ్గన ఆధారాలతో సహా వివరించారు.
గత పాలనలో రాష్ట్రం అప్పుల కుప్ప..
తెలుగుదేశం పార్టీ హయాంలోనే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. స్థూల ఉత్పత్తిలో నిష్పత్తి చూస్తే ఈ విషయం అర్థం అవుతోంది. ప్రభుత్వం ఎన్నికల ముందు మహిళలను ఆకట్టుకోవడానికి తెరపైకి తెచ్చిన పసుపు – కుంకమ కార్యక్రమం కోసమే దాదాపు 10,000 కోట్లు అప్పు చేశారని అప్పట్లో ఆరోపణలు గుప్పుమన్నాయి. అలాగే.. 1994–95లో రాష్ట్రంలో అప్పులు, స్థూల ఉత్పత్తి నిష్పత్తి 18.5 శాతం ఉండగా, అది 2004 నాటికి అది ఏకంగా 31 శాతానికి పెరిగింది. ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకు దాన్ని 31 శాతం నుంచి 22 శాతానికి ఆ ప్రభుత్వాలు తగ్గించాయి. కానీ మళ్లీ చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చాక అప్పు నుంచి స్థూల ఉత్పత్తి నిష్పత్తి 28 శాతానికి వెళ్లింది. జగన్ అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం చేసిన తప్పులను చేయకుండా నిపుణులతో చర్చించి నిర్థిష్టమైన ఆర్థిక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. కానీ.. టీడీపీ మాత్రం వాస్తవాలను కప్పి పుచ్చి అసత్య ప్రచారాలతో ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తోంది. కానీ.. ఎక్కడా వాటికి సంబంధించి సరైన ఆధారాలు చూపలేకపోతుందని ప్రభుత్వ వర్గాలు విమర్శిస్తున్నాయి.
కేంద్ర నిధులను అడ్డుకునే కుట్ర
తాము చెడిపోయినా పర్వాలేదు.. ఎదుటి వాడు బాగుపడకూదన్న కుటిల నీతి టీడీపీ ప్రదర్శిస్తోందని ప్రభుత్వం ఆవేదన వ్యక్తం చేస్తోంది. కొద్ది రోజుల క్రితం ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని పరిస్థితులను వివరించారు. తమ రాష్ట్రానికి కావాల్సిన నిధులను విడుదల చేయాల్సిందిగా కోరారు. జీఎస్టీ కంపెన్సేషన్ పాతది, 2017–18, 2019–20కి సంబంధించి రూ.237 కోట్లు పెండింగులో ఉన్నాయని, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.3500 కోట్లు రీయంబర్స్ మెంట్ చేయాలని కోరారు. అలాగే రాష్ట్ర పునర్విభజన చట్టంకు అనుగుణంగా వెనకబడిన 7 జిల్లాలకు ఇవ్వాల్సిన నిధులపై కూడా చర్చించారు. దీనికి కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఈ క్రమంలోనే టీడీపీ కాకి లెక్కలతో ప్రభుత్వం బురద జల్లుతోందని, కేంద్ర నిధులను అడ్డుకునే కుట్ర చేస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.