iDreamPost
android-app
ios-app

జగన్‌ అన్యాయం చేస్తున్నాడా..? చర్చ జరగాలి.. !

జగన్‌ అన్యాయం చేస్తున్నాడా..? చర్చ జరగాలి.. !

ప్రజలకు అన్నీ ఒకేసారి ఇవ్వకూడదు. అలా ఇస్తే ఇకపై మనతో వారికి పని ఏముంటుంది..?.. అనేది ఓ సినిమాలో రాజకీయ నాయకుడు చెప్పే డైలాగ్‌. ఇది సినిమాలో రాజకీయ పాత్రలో ఉన్న నటుడు చెప్పిన మాట అయినా.. నిన్న మొన్నటి వరకూ వాస్తవం కూడా ఇదే. అయితే ఇందుకు పూర్తి విరుద్ధంగా ప్రజలకు కావాల్సిన ప్రస్తుత కనీస అవసరాలైన ఇళ్లు, నాణ్యమైన విద, వైద్యం వైఎస్‌ జగన్‌ సర్కార్‌ అందిస్తుండడంతో నిన్న మొన్నటి వరకూ సినిమా డైలాగ్‌ తరహలో రాజకీయాలు చేసిన నేతలకు మింగుడుపడడం లేదు. అందుకే జగన్‌ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై రంధ్రాన్వేషణ సాగిస్తూ రాజకీయాలు చేస్తున్నారనే విమర్శలు సర్వత్రా వస్తున్నాయి.  

తాజాగా టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకటరావు సీఎం జగన్‌కు ఓ బహిరంగ లేఖ రాశారు. జగన్‌ ఏమో బంగళాలు కట్టుకున్నారు. ప్రజలకేమో సెంటు స్థలం ఇస్తారా..? అన్నది సదరు లేఖ సారాంశం. అంతేకాదు.. ఇదెక్కడి న్యాయం అంటూ కూడా ఎనలేని ప్రేమను కురిపిస్తున్న కళా వెకంటరావు అసలు వాస్తవాన్ని మారచిపోతున్నారని ప్రజలు గుర్తు చేస్తున్నారు. విభజన తర్వాత ఏపీలో ఐదేళ్ల పాటు అధికారం వెలగబెట్టినది టీడీపీయే. అందులో కళా కూడా మంత్రిగా పని చేశారు. మరి ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలోని పేదలు ఎంత మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు..? ఎంత మందికి ఇళ్లు కట్టించి ఇచ్చారు..? అనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి వస్తే కళా వెంకటరావు నీళ్లు నమలడం తప్పా ఏమీ చేయలేని పరిస్థితి వస్తుంది. పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు కట్టిస్తున్నామని ఒక్కొక్క లబ్ధిదారుడు నుంచి పలుమార్లు దరఖాస్తులు స్వీకరించారు. ఇళ్లు కేటాయించామంటూ లబ్ధిదారుల నుంచి 50 వేల నుంచి లక్ష రూపాయల వరకూ లంచాలు వసూలు చేసిన విషయం పట్టణాలలో ఇళ్లు లేని వారిని అడిగితే టీడీపీ నేతల చిత్రాలు కథలు కథలుగా చెబుతారు. అయినా ఆ ఇళ్లు వాళ్లకు ఇవ్వలేదు.

జగన్‌ వచ్చాక.. ఎంఆర్‌వో, సబ్‌కలెక్టర్, మున్సిపల్‌ కార్యాలయం, ఎమ్మెల్యే, కౌన్సిలర్‌.. ఇలా ఎవరి వద్దకు వెళ్లి.. అయ్యా మాకు ఇళ్ల స్థలం లేదా ఇళ్లు ఇవ్వండని పలుమార్లు అర్జీ పెట్టుకునే పరిస్థితి లేదు. ఏ పార్టీ అనేది చూడడం లేదు. అర్హులు ఎంత మంది ఉంటే అంతమందికి ఇళ్ల స్థలం ఇస్తామని సీఎం జగన్‌ చెప్పారు. ఆ మేరకు వాలంటీర్ల ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంటే.. 30 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వ భూమి లేదా ప్రైవేటు భూమి కొనుగోలు చేసి ఇచ్చేందుకు అన్నీ సిద్ధం చేశారు. కానీ వాటిని అడ్డుకునేందుకు టీడీపీ నేతలు కోర్టుల్లో కేసులు వేసిన విషయం కళా వెంకటరావు మరచిపోయినట్లు ఉన్నారు. పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర స్థలం ఇస్తున్న జగన్‌ అన్యాయం చేస్తున్నాడా..? లేక ఆ స్థలాలు పేదలకు అందకుండా కోర్టుల్లో కేసులు వేసిన టీడీపీ అన్యాయం చేస్తుందా..? అనేదే ఇప్పుడు జరగాల్సిన చర్చ.

Read Also ; ఈఎస్‌ఐ స్కాంలో మళ్లీ మొదలైన అరెస్ట్‌ల పర్వం