iDreamPost
android-app
ios-app

Kuppam TDP Kidnap -సొంత అభ్యర్థులనే కిడ్నాపా? ఇదేం దుష్ట రాజకీయం?

Kuppam TDP Kidnap -సొంత అభ్యర్థులనే కిడ్నాపా? ఇదేం దుష్ట రాజకీయం?

ఆంధ్రప్రదేశ్ లో నగర పంచాయతీలు సహా కొన్ని మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో ఎలా అయినా గెలిచి పట్టు నిలుపు కోవాలి అని తెలుగుదేశం పార్టీ భావిస్తుంటే అక్కడ తమ అభ్యర్థులను గెలిపించుకుని చంద్రబాబు పని అయిపోయింది అని నిరూపించడానికి వైసిపి తాపత్రయపడుతోంది. అయితే అక్కడ జరుగుతున్న రాజకీయ పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతున్నాయి. తాజాతా కుప్పం 14వ వార్డుకు కౌన్సిలర్‌ నామినేషన్‌ వేసిన టీడీపీ రెండో అభ్యర్థి ప్రకాష్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు అదృశ్యమవడం సంచలనంగా మారింది. ఇదే వార్డుకు వెంకటేష్‌ అనే వ్యక్తి కూడా టీడీపీ తరుపున నామినేషన్‌ వేశారు.

కానీ స్రూటినీలో వెంకటేశ్‌ నామినేషన్‌ సక్రమంగా లేనందువలన అతని నామినేషన్ తిరస్కణకు గురైంది. ఈ క్రమంలో డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ప్రకాష్ ఇప్పుడు అసలు అభ్యర్థిగా బరిలో నిలబడినట్లయింది. ప్రకాష్ బరిలో నిలబడినట్లు తెలిసిన వెంటనే ప్రకాష్ సహా ప్రకాష్ కుటుంబమంతా అదృశ్యం కావడంతో ప్రకాష్ సోదరుడు ఆందోళనకు గురయ్యాడు. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, చంద్రబాబు పీఎ మనోహర్, టీడీపీ నేతలు పీఎస్‌ మునిరత్నం, మాజీ సర్పంచ్ వెంకటేష్ లు నా తమ్ముడు ప్రకాష్ తో పాటు , అతని భార్యను, అతని పిల్లలు ఇద్దర్నీ బెదిరించి దౌర్జన్యంగా తీసుకెళ్లారని, వారి ఆచూకీ లేదని ప్రకాష్ అన్న గోవింద రాజులు పోలీసులకి ఫిర్యాదు చేశాడు. సొంత పార్టీకి చెందిన అభ్యర్ధినే ఇలా కిడ్నాప్ చేయడం దారుణం అని ప్రకాష్ అన్న గోవిందరాజులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అయితే దీనిని ఇప్పుడు టీడీపీ నేతలు కవర్ చేసుకునే పనిలో పడ్డారు. ఈ కిడ్నాప్ ఆరోపణలను అమర్ నాథ్ రెడ్డి ఖండించగా ఏకంగా ఆ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్న అయితే కొత్త స్టోరీ చెప్పుకొచ్చారు. ప్రకాష్‌ పై వైసీపీ నేతలు దాడి చేసేందుకు కుట్రపన్నారని రక్షణతో పాటు తన నామినేషన్‌ కాపాడుకోవటం కోసం ప్రకాష్ స్వచ్ఛందంగా తన నామినేషన్‌ ముగిసే వరకు జాగ్రత్తగా ఉన్నారని తెలిపారు.

ప్రకాష్‌ ను ఎవరూ కిడ్నాప్‌ చేయలేదని, ఆ ప్రచారం అవాస్తవమని చెప్పుకొచ్చారు. నిజంగా ఎవరూ కిడ్నాప్ చేయకపోతే ప్రకాష్ సొంత అన్న పోలీస్ స్టేషన్ మెట్లెక్కి ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఏముంది? ఎవరైనా ఇలా సొంత ఇంటి పరువు తీసుకోవాలని కోరుకోరు కదా!.. ఒకవేళ టీడీపీ నేతలు కిడ్నాప్ చేయకుండా ఉంటే అతని సోదరుడికి సమాచారం ఇచ్చి తీసుకెళ్లొచ్చు కదా. లేదు ఆయనే స్వచ్ఛందంగా సేఫ్ గా అండర్ గ్రౌండ్ కి వెళ్ళారు అంటున్నారు, అన్నకు చెప్పకుండానే వెళ్తారా? అంటే సొంతం అభ్యర్థుల మీద కూడా నమ్మకం లేకుండా టీడీపీ చేస్తున్న రాజకీయం మరోసారి బట్టబయలైంది. ఇలాంటి రాజకీయం చేయడం, నవ్వుల పాలు అవ్వడం ఎందుకు అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.