iDreamPost
iDreamPost
ఏపీ రాజకీయాల్లో నెంబర్ 23 చర్చనీయాంశం అవుతోంది. ఇప్పటికే టీడీపీకి ప్రతిపక్ష హోదాకి కూడా బొటాబొటీగా 23 సీట్లు మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత ప్రతీ సందర్భంలోనూ శుక్రవారం, 23వ తేదీ వచ్చాయంటే పలు ఘటనలు జరుగుతున్నాయి. టీడీపీ నేతలకు సమస్యగా మారుతున్నాయి. అదే క్రమంలో ఈరోజు కూడా యాధృశ్చికంగా 23వ తేదీ శుక్రవారం నాడు టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్ కావడం ఆసక్తిగా మారింది.
సంగం డెయిరీ లో జరిగిన అవకతవకలపై నరేంద్రని అరెస్ట్ చేశారు. ఏసీబీ అధికారులు ఉదయాన్నే ఆయన ఇంటి వద్ద అరెస్ట్ చేసి తరలించారు. ఆయన భార్యకు నోటీసు ఇచ్చారు. సంగం డెయిరీలో జగిన అక్రమాలపై చాలాకాలంగా ఫిర్యాదులున్నాయి. ఏసీబీలో కేసు నమోదయ్యింది. అయితే అనూహ్యంగా ఈరోజు ఉదయాన్నే పోలీసులు ధూళిపాళ్ల ఇంటికి చేరుకుని అరెస్ట్ చేయడం చర్చనీయాంశం అవుతోంది.
నరేంద్రపై ఏసీబీ కేసు ఐపీసీ 408, 409, 418, 420, 465, 471, 120బీ, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద నమోదయ్యింది. సీఆర్‌పీసీ సెక్షన్ 50(2) కింద నరేంద్ర సతీమణికి ఏసీబీ నోటీసులు అందించారు. నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్టు నోటీస్ లో పేర్కొన్న ఏసీబీ అధికారులు ఆయన్ని కొద్దిసేపట్లో కోర్టుకి తరలించే అవకాశం ఉంది. ఇప్పటికే అవినీతి వ్యవహారాల్లో అచ్చెన్నాయుడు జైలుకి వెళ్లగా, హత్య కేసులో కొల్లి రవీంద్ర, దౌర్జన్యాలకు పాల్పడి కూనా రవికుమార్ వంటి వారు జైలుపాలయ్యారు. ఇప్పుడు దూళిపాళ్ల నరేంద్ర వంతు రావడం విశేషంగా మారింది. ఓవైపు దేవినేని ఉమా వ్యవహారం లో సీఐడీ దూకుడుగా ఉంది. దానికి ముందే ధూళిపాళ్ల అక్రమాలు తెరమీదకు రావడం గమనార్హం.