Idream media
Idream media
గ్రామాలే ఈ దేశానికి పట్టుకొమ్మలు అన్నారు మహాత్మా గాంధిజీ. అలాంటి గ్రామాలని గత తెలుగుదేశం ప్రభుత్వం తన రాజకీయ మనుగడ కోసం వాడుకుంది. జన్మభూమి కమిటీల పేరిట ముఠాలను పెంచి పోషించింది. పంచాయతీ రాజ్, మరియు రూరల్ వాటర్ సప్లై ( PR & RWS) శాఖలను చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ చేతిలో పెట్టి నిర్వీర్యం చేశారు. గ్రామాలలో నాయకులు నామినేటెడ్ పనుల పేరిట కొన్ని కోట్ల రూపాయలు విచ్చలవిడిగా దోచేశారు. స్మశానాల అభివృద్ధి, చెరువుల అభివృద్ధి, పాఠశాలల మరమ్మత్తులు, రోడ్లు రిపేర్లు ఇలా ప్రతి పనులు నామినేషన్ ద్వారా తీసుకొని సదరు జన్మభూమి కమిటీలు దోచేశారు. ఇందులో సంబంధిత అధికారులు కూడా డిపార్ట్మెంట్ పర్శంటేజ్ అనే గొలుసుకట్టు లంచగొండితనంతో గ్రామాలను సర్వనాశనం చేశారు.
గుంటూరు,ప్రకాశం జిల్లాలలోని గ్రామాలలో సాధారణ అవసరాలకు వాడుకోవడానికి కూడా పనికిరాని నీరు సరఫరా అవుతున్నాయంటే అది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగిన దోపిడికి ఒక ఉదాహరణ. సమ్మర్ స్టోరేజ్ టాంక్ లకు, సంబంధిత కట్టలకు కనీసం ఫెన్సింగ్ లు కూడా లేకుండా చేయడం వలన, ప్రజలు గేదెలు కడుక్కొని వాటినే ఓవర్ హెడ్ ట్యాంకులకు పట్టుకొని వాడుకున్నారు. ఫిల్టర్ బెడ్ లు బాగుచేసినా వాటికి ఉపయోగించవలసిన కోర్స్ ఇసుక కొత్తగా తెచ్చినది వాడకుండా, ఫిల్టర్ బెడ్ లో ఉన్న పాత ఇసుకనే మళ్ళి వాడి ఆ ఖరీదుకు పంచాయతీ నిధులు మింగేసారు. దీనివలన RO ప్లాంట్ ద్వారా శుభ్రమయ్యి వచ్చే నీరు చూడటానికి తెల్లగా ఉన్నా కంపుకొడుతూ ఉండటం, ప్రజలు అవే తాగటంతో అనేక రకాల రోగాల బారిన పడటం నిత్యం జరుగుతూనే ఉంది. Oxidation, Clarifire mechanism లాంటివి సంబంధిత శాఖల అధికారులకు కనీసం ఈ విషయాలు పట్టకపోవడం బాధాకరం.
తెలుగుదేశం ప్రభుత్వంలో కాలువల నుండి గ్రామాలలోని స్టోరేజ్ ట్యాంకులకు నీరు వెళ్ళటానికి సరైన డిస్ట్రిబ్యూషన్ లైన్ లు కూడా లేవు. నీళ్ళు వదిలనప్పుడు రాజకీయ బలంతో ఎవరికి వారు, వారికున్న అవకాశాలు వినియోగించుకుని మోటార్లు, ట్రాక్టర్లకు ఇంజెన్లు పెట్టుకొని గ్రామాలలోనే పంప్ చేసుకునేవారు . దీంతో కొన్ని ఎగువ గ్రామాలకు ఆ గుక్కెడు మురికి నీళ్ళు కూడా దొరికేవి కావు.బుచ్చయ్య చౌదరి లాంటి సీనియర్ నాయకులు అసెంబ్లీ లో ఇసుక కొరత వల్ల ఈ పరిస్థితి వచ్చింది అని మాట్లాడతారు. కాని నిజానికి ఏ ఇసుక పడితే ఆ ఇసుక పోయకూడదన్న అవగాహన కూడా ఆ వ్యక్తికి లేకపొవటం బాధాకరం.
” ఫిల్టర్ బెడ్ బావుల్లో ” పోయవలసినది ఇసుక కాంపోనెంట్, మామూలు ఇసుక కాదు. 8.84 cubic mtrs 0.7 – 1.40 mm size Course sand. దాని మీద 88.36 cubic MTR అంటే అడుగు 0.2 – 0.3 mm size fine sand వాడాలి. ఏ ఇసుక బడితే ఆ ఇసుక పోయడానికి అవి ఇంకుడు గుంటలు కావు అని బుచ్చయ్య చౌదరిలాంటి నాయకులు తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. తెలుగుదేశం పార్టీ హయాంలో గ్రామాల్లో పచ్చ తమ్ముళ్ళు ఏ ఇసుక బడుతే ఆ ఇసుక, తీసిన ఇసుకే ఎండ బెట్టి మళ్ళీ పోసి కోట్లు దోచుకొని బంగారం లాంటి ఫిల్టర్ బెడ్ బావులను నాశనం చేశారు. శుధ్ధమైన నీళ్ళను వాడుకోవడానికి ప్రజలను దూరం చేశారు.తెలుగుదేశం పాలనలో అస్తవ్యస్తమైన పల్లెలను ఇప్పుడున్న ప్రభుత్వం గాడిలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Written By – Srikanth Bhagi