iDreamPost
android-app
ios-app

Fack Votes, Chandrababu Naidu, Kuppam – ఆడలేక మద్దెల వోడు..ప్రతి ఎన్నికల్లోనూ బాబు ఎత్తుగడ

Fack Votes, Chandrababu Naidu, Kuppam – ఆడలేక మద్దెల వోడు..ప్రతి ఎన్నికల్లోనూ బాబు ఎత్తుగడ

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కొత్త రాజకీయానికి తెర తీశారు. జయమ్ము నిశ్చయమ్మురా అనే సినిమాలో మంగళవారం అంటే కృష్ణభగవాన్ పాత్ర తడుముకున్నట్టుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఎన్నికలు జరుగుతున్నా చంద్రబాబు నాయుడు అక్కడ దొంగ ఓటర్లు కనిపిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ జరిగింది. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్‌ రాష్ట్రంలోని నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు కుప్పం, బుచ్చిరెడ్డిపాలెం, ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, గురజాల, దాచేపల్లి, దర్శి, బేతంచెర్ల, కమలాపురం, రాజంపేట, పెనుకొండ మున్సిపాలిటీలకు పోలింగ్ జరిగింది. వీటితో పాటు రాష్ట్రంలోని మరో 7 కార్పొరేషన్లలో 12 డివిజన్లకు ఎన్నికలు నిర్వహించారు. పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో సున్నితమైన కేంద్రాలకు భారీగా పోలీసు బలగాలను తరలించింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం.

Also Read : Chandrababu, Fake Votes Allegations – కుప్పంలో తిరుప‌తి సీన్ రిపీట్‌

ఎన్నికలు ప్రశాంతంగా జరిగిపోతుంటే ఓటమి తప్పదు అని భావిస్తూ రేపు జనాల ముందు పరువు పోతుందనే భయంతో చంద్రబాబు ఈ దొంగ ఓట్ల ప్రచారం మొదలు పెట్టారు. టీడీపీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతున్న దాని మేరకు ఎక్కడ కొత్త వాళ్ళు కనపడినా ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయాలని పార్టీ నుంచి ఆదేశాలు అందాయట. పార్టీ ఆదేశాల మేరకు ఫోటోలు, వీడియోలు వైరల్ చేస్తున్నామని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే నిజంగా దొంగ ఓటర్లు ఉన్నారా అంటే ఎవరూ చెప్పలేని పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల నేపధ్యంలో ప్రత్యేకంగా ఎవరినో బయట నుంచి తీసుకువచ్చి చేయించాల్సిన అవసరం అయితే వైసీపీకి లేదు. అదీకాక కొన్ని చోట్ల ఓటమిపాలైతే ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు వచ్చే నష్టం కూడా లేదు. కానీ ఏదో జరిగిపోతోంది.. ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగిపోతోంది అనేలా ప్రచారం చేస్తూ.. తాము అనుకున్న దాన్ని జనాల్లోకి చొప్పించడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం అంటూ లేదు. అందులో భాగంగానే ఈ దొంగ ఓట్ల వ్యవహారాన్ని తెరమీదకు తీసుకు వస్తున్నారు అనేది విశ్లేషకుల వాదన.

Also Read : Kuppam Election, Nara Lokesh – ఓటమికి కారణాలు సిద్ధం చేస్తున్న లోకేశ్

గతంలో తిరుపతి ఉప ఎన్నికలు జరిగిన సమయంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనానికి వచ్చిన భక్తులను సైతం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీకి మద్దతు పలికే కొన్ని ఛానళ్లు ఇబ్బందులు పెట్టిన వీడియోలు చాలా చూశాం. ఇప్పుడు ఈ కుప్పం విషయంలో కూడా ఓటమి ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో చంద్రబాబు వెంటనే రంగంలోకి దిగి పోలింగ్ సగం కూడా పూర్తి కాకుండానే దొంగ ఓట్లు వేయించారు అంటూ ఏదో జరిగిపోతోంది, అన్నట్లు గగ్గోలు పెట్టడం మొదలు పెట్టారు. నిజంగా అదే జరిగితే వీడియోలు సోషల్ మీడియాలో పెట్టడం కంటే ఎన్నికల అధికారులకు ఇస్తే ఏమైనా ఉపయోగం ఉంటుంది. కానీ అక్కడ బాబు అండ్ కో చెబుతున్న వ్యవహారం జరగలేదు కాబట్టి కేవలం ప్రజల దృష్టి మరల్చడానికి, రేపు కుప్పంలో ఓడిపోయాక మా హవా ఏమీ తగ్గలేదు అని, దొంగ ఓట్లతో గెలిచారు అనే ఆరోపణలు చేయడం కోసమే దొంగ ఓట్ల డ్రామాకు తెరతీశారని అంటున్నారు.

Also Read : TDP Chandrababu, Kuppam Elections – కుప్పంలో టీడీపీ ఓడిపోతోందా..? చంద్రబాబు ఎందుకలా మాట్లాడారు..?