కేంద్ర ప్రభుత్వ పెట్రో ప్రొడక్ట్స్ రేట్ల తగ్గింపు ఒక ప్రహసనం లాగే సాగింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై రూ.5, లీటర్ డీజిల్ మీద రూ.10 ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. దీంతో ఇంధన ధరలు తగ్గాయి. మోడీ సర్కార్ నిర్ణయంతో తొమ్మిది బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా వ్యాట్‌ను తగ్గించాయి. కానీ ముందు నుంచి తీరును మనం పరిశీలిస్తే నరేంద్ర మోడీ గద్దెనెక్కినప్పటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు అనేక రెట్లు పెరిగాయి. ఎక్సైజు సుంకాలు, సెస్‌ల పేరుతో మునుపెన్నడూ లేని విధంగా ఎక్కడికక్కడ పన్నులు విధించడంతో అవి చుక్కలనంటాయి.
దానికి చిన్న ఉదాహరణ ఏంటంటే 2014లో ఒక బ్యారెల్ ముడి చమురు ధర 109 డాలర్లు ఉన్నప్పుడు, పెట్రోల్ మన దగ్గర ధర లీటర్ 71 రూపాయలకు దొరికేది. ఇప్పుడు క్రూడాయిల్ ధర 85 డాలర్లే ఉన్నా లీటర్ పెట్రోల్ రూ.111, డీజిల్ రూ.100 పై మాటే. ఒకప్పుడు ఈ పెట్రో ప్రొడక్ట్స్ రిటైల్ ధరలో 66 శాతం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు, రిటైల్ ధరలో 34 శాతం డీలర్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను రూపంలో పొందేవి. 2014 ముందు డీలర్లకు, రాష్ట్ర ప్రభుత్వ వాటాలు మినహాయిస్తే కేంద్ర ప్రభుత్వానికి 14 శాతం ఆదాయం ఉండేది. కానీ ఇప్పుడు అది 32 శాతానికి పెరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాల వాటా 2014లో 17 శాతం ఉండగా, ఇప్పుడు అది 23 శాతానికి చేరింది. డీలర్ల కమీషన్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు మొత్తం కలిపి 34 శాతం నుంచి 58 శాతానికి పెరిగాయి.
Also Read : Tdp,Bjp Protest-పెంచిన వారే రోడ్డెక్కి ధర్నాలు చేస్తుంటే ఇంతకంటే ఘోరం ఉంటుందా
మోడీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌ను చక్కటి ఆదాయ వనరుగా భావిస్తూ ఉండడంతోనే గత మూడేళ్లలో మోడీ సర్కార్ కేవలం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాల రూపంలో రూ.8.12 లక్షల కోట్లకు పైన రాబట్టుకుంది. ఎక్సైజ్ సుంకాల కింద 2014లో 75 వేల కోట్లు వసూలు చేసిన కేంద్రం, 2021లో దీనిని 3.60 లక్షల కోట్లు వసూలు చేసింది. దానికి బీజేపీ సర్కార్ కవర్ చేసుకునేది ఏంటంటే యూపీఏ సర్కార్ లక్షల కోట్లు అరబ్ దేశాలకు అప్పు చేస్తే దాన్ని చెల్లించామని. ఇక ఇప్పుడు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే చేయాల్సింది అంతా చేసిన బీజేపీ తమ తమ లోకల్ నేతలతో రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రో రేట్లు తగ్గించాలని ధర్నాలు చేయించడం. అయితే ఈ లెక్కలు అన్నీ చూస్తే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది ఎంత? తగ్గించింది ఎంత? అనేది క్లారిటీ వస్తుంది. బీజేపీ అధికారంలోకి రాగానే ఇబ్బడిముబ్బడిగా పెంచి, అరకొరగా తగ్గించి, ధర్నా అంటూ ఇప్పుడు రాజకీయం చేస్తుండగా, టీడీపీ నేతలు ఏమో తమ హయాంలో ఎంత పెంచామో మరచి రాజకీయం చేస్తున్నారు.
నిజానికి కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై 3.35,000 కోట్ల రూపాయల పన్నులు వసూలు చేసినప్పటికీ అందులో రాష్ట్రాలకు పంచింది. కేవలం 19,475 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే కేవలం 5.80 శాతం. లెక్కల ప్రకారం కేంద్రం వసూలు చేసే పన్నుల్లో రాష్ట్రాలకు 41 శాతం వాటా పంచవలసి ఉన్నప్పటికీ పెట్రో ఆదాయాన్ని విజిబుల్ రాకుండా సెస్ లు, సర్చార్జి రూపంలో సుమారు 2,87,500 కోట్ల రూపాయలు వసూలు చేసి ఆ మేరకు రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటా తగ్గించింది. ఇక ఏపీలో బాబు హయాంలో రోడ్ల అభివృద్ధిపై దృష్టి పెట్టలేదు. దీంతో అనేక ప్రాంతాల్లో రోడ్డు దెబ్బతిన్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇబ్బడిముబ్బడిగా వర్షాలు కురిసిన వర్షాల కారణంగా రోడ్ల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రూ.2,205 కోట్లతో 8,970 కి.మీ. మేర రోడ్ల అభివృద్ధి,మరమ్మత్తులు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రత్యేకంగా లీటరుకు కేవలం ఒక్క రూపాయి మాత్రమే సుంకంగా విధించింది. అంటే రోడ్ల మరమ్మతుల కోసం గత ప్రభుత్వం విధించిన దానికంటే ఒక్క రూపాయి అధికంగా విధించింది. దానికి ఏపీలో దోపిడీ జరిగిపోతోంది అన్నట్టు టీడీపీ, బీజేపీలు రచ్చ చేయడాన్ని ఏమనాలో?
Also Read : Chandrababu Petrol Politics – పెట్రో ధరలు – చరిత్ర మరచిపోయారా బాబూ..?