ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఎలా అయినా వచ్చే ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తోంది. నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడికి ప్రజలు పట్టం కట్టారు . కానీ ప్రజల అంచనాల మేరకు చంద్రబాబు నాయుడు పరిపాలన సాగలేదనే విషయం తేటతెల్లమైంది. తన వారిని అందలం ఎక్కించడమే కాక తలా తోకా చేసిన అనేక కార్యక్రమాల దృష్టా ఆ పార్టీ ఘోర ఓటమి పాలైంది. వైఎస్ జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు, జగన్ తమకు ఏదైనా చేస్తాడు అనే నమ్మకంతో ప్రజలు ఆయనకు ఓట్లేసి గెలిపించారు. ఆయన అన్నట్లుగానే తన పాదయాత్రలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చారు. కొన్ని హామీల విషయంలో లీగల్ గా ఇబ్బందులు ఉన్నా సరే వాటిని పరిష్కరించి ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు.
కానీ ఇప్పటికీ ప్రజలు జగన్ కి ఓటేసి తప్పు చేశారు అంటూ తెలుగుదేశం పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. తాజాగా బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. జగన్ చరిత్ర తెలిసి మరి ప్రజలు ఓట్లు వేశారని, కానీ ఇప్పుడు టిడిపిని లేకుండా చేసేందుకు జగన్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. వైసీపీ తరహాలో టిడిపి గాలికి పుట్టి గాలికి పెరగలేదని, దేవాలయం లాంటి పార్టీ కార్యాలయంపై దాడి చేయడానికి వైసీపీ నేతలకు సిగ్గు లేదా అని ఆయన ప్రశ్నించారు. అయితే జగన్, వైసీపీని విమర్శించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న అచ్చెన్నాయుడు కి వైసీపీ మొదలుపెట్టిన నాటి నుంచి ఇప్పటివరకు ఏం జరిగిందనే విషయం తెలిసే ఉంటుంది.
తెలుగుదేశం పార్టీని స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రారంభిస్తే దానిని వెన్నుపోటు పొడిచి మరి చంద్రబాబు నాయుడు హస్తగతం చేసుకున్నారు. కానీ వైఎస్ జగన్ మాత్రం తానుగా ఒక పార్టీని స్థాపించి ఒక్కడిగా మొదలై ఈ రోజు ప్రభంజనంలా మారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పరిపాలనను కొనసాగిస్తున్నారు. అలాంటి జగన్ కు ప్రజలు ఓట్లు వేసి తప్పు చేశారు అని ఈయన గారు ఎలా డిసైడ్ చేశారో మరి? ఒకవేళ నిజంగా ప్రజలు తప్పు చేశారు అని భావిస్తే వచ్చే ఎన్నికల్లో ఆ ఫలితం ఖచ్చితంగా తేటతెల్లమవుతుంది. అయినా వచ్చే ఎన్నికల దాకా ఎందుకు? వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు జరిగిన దాదాపు అన్ని ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. స్థానిక సంస్థల ఎన్నికలు మొదలు, పంచాయతీలు, ఉప ఎన్నికలు అన్నింటిలో కూడా వైసీపీ దే హవా. ప్రజలు జగన్ ను గుండెల్లో పెట్టుకున్నా, కేవలం అధికారమే లక్ష్యంగా జగన్, వైసీపీ మీద బురదజల్లడమే పనిగా మాట్లాడితే ఎవరు మాత్రం ఏం చేయగలరు.
Also Read : హామీ ఇవ్వలేదు.. ప్రజలు కోరుకున్నారు.. జగన్ చేస్తున్నారంతే..