iDreamPost
iDreamPost
రైతు భరోసాపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటతప్పారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పాదయాత్రలో రూ.12,500 ఇస్తానని..ఇప్పుడు రూ.7,500 మాత్రమే ఇస్తానంటున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ వాలంటీర్లకు నెలకు రూ. 8వేల వేతనం ఇస్తూ.. రైతుకు మాత్రం రూ.625 మాత్రమేనా? ఇస్తారా అని ప్రశ్నించారు. కులాలు, మతాల వారీగా రైతులను విడదీశారని విమర్శించారు. ఏపీలో జీఎస్టీతో పాటు జేఎస్టీ కూడా విధిస్తున్నారన్నారు. రూ. 47వేల కోట్లు దోచుకున్న జగన్‌కు ప్రధానిని నిధులు అడిగే ధైర్యం లేదన్నారు. 5 నెలల్లోనే జగన్‌పై ప్రజలు నమ్మకం కోల్పోయారని బుద్దా వెంకన్న అన్నారు.