iDreamPost
android-app
ios-app

ఎమ్మెల్యే పెద్దారెడ్డి సతీమణికి తృటిలో తప్పిన పెను ప్రమాదం.. అసలేమైందంటే?

ఎమ్మెల్యే పెద్దారెడ్డి సతీమణికి  తృటిలో తప్పిన పెను ప్రమాదం.. అసలేమైందంటే?

అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి భార్య రమాదేవికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. అనంతపురం నుండి తాడిపత్రి వెళ్లే దారిలో ఉన్న ముచ్చుకోట కనుమలో రమాదేవి ప్రయాణిస్తున్న ఇన్నోవా కారును వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో కారు పూర్తిగా ధ్వంసం కాగా.. ఎమ్మెల్యే సతీమణి రమాదేవి సురక్షితంగా బయటపడ్డారు. ఎటువంటి చిన్నపాటి గాయాలు కూడా వాహనంలో ప్రయాణిస్తున్న వారికి కాలేదని వారు తెలిపారు. ఈ కారులో ఎమ్మెల్యే సతీమణి రమాదేవి, డ్రైవర్ మాత్రమే ప్రమాద సమయంలో ఉన్నారని చెబుతున్నారు. వీరు అనంతపురం మీదుగా తిమ్మంపల్లి వెళుతున్నారని వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొంది. ఇక ఇది ఆర్టీసీ అద్దెబస్సు అని గతంలో కూడా ఇదే రహదారి మీద అతివేగం కారణంగా బోల్తా పడిందని తేలింది. ఆర్టీసీలో ఇలా అద్దె బస్సుల డ్రైవర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్నారని చెబుతున్నారు.

పెద్దారెడ్డి స్వగ్రామం అనంతపురం జిల్లా, యల్లనూరు మండలం, చింతకాయ మంద పంచాయతీ పరిధిలోని తిమ్మంపల్లి గ్రామం. ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా ఆ గ్రామానికి వెళుతూనే ఆయన భార్య రమాదేవి తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆమెకు ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.