iDreamPost
android-app
ios-app

జేసీ బ్ర‌ద‌ర్స్ ఆమ‌ర‌ణ దీక్ష ప్ర‌క‌ట‌న రెచ్చ‌గొట్టేందుకేనా..?

జేసీ బ్ర‌ద‌ర్స్ ఆమ‌ర‌ణ దీక్ష ప్ర‌క‌ట‌న రెచ్చ‌గొట్టేందుకేనా..?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు స‌హా నేత‌లంరూ రాష్ట్రంలో కొత్త త‌ర‌హా రాజ‌కీయాలు ప్రారంభించిన‌ట్లుగా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఏపీలో ఆ పార్టీని ప‌ట్టించుకునే నాథులెవ్వ‌రూ క‌నిపించ‌డం లేదు. ఒక‌వైపు వైసీపీ.. మ‌రో బీజేపీ ఆ పార్టీని క‌మ్మేస్తున్నాయి. దీంతో ఎలాగైనా టీడీపీ ఉనికి నిల‌బెట్టే తాప‌త్ర‌యం ఆ వారిలో క‌నిపిస్తోంది. ప్ర‌జ‌లు ఇప్పుడు త‌మ వైపు లేరు కాబ‌ట్టి.. ప్ర‌జా కార్య‌క్రమాలు చేప‌ట్టినా ప్ర‌యోజ‌నం లేద‌ని భావిస్తూ ఉద్రిక్త రాజ‌కీయాల‌ను ఎంచుకున్న‌ట్లుగా తెలుస్తోంది. ఎక్క‌డైనా ఎటువంటి కార్య‌క్రమాలు చేయ‌కూడదో.. అక్క‌డ అవే చేప‌డుతూ ఆందోళ‌న‌లు రేకెత్తించ‌డమే టీడీపీ ఉద్దేశంగా ప్ర‌స్తుత రాజ‌కీయాల‌ను చూస్తే విశ‌ద‌మ‌వుతోంది. ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు విజ‌య‌న‌గ‌రం యాత్ర చేప‌ట్టిన రోజే.. తాడిప‌త్రిలో జేసీ వివాదాస్ప‌ద స్టేట్ మెంట్స్ ఇస్తున్నారు. సోదరుడు ప్రభాకర్‌ రెడ్డితో కలిసి ఈనెల నాలుగో తేదిన తాడిపత్రిలో ఆమరణ దీక్ష చేస్తానంటూ టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డిప్రకటించారు.

అనుమ‌తి ఉండ‌ద‌ని తెలిసే..

ఇటీవ‌ల జ‌రిగిన సంఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో తాడిపత్రిలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు ఆంక్షలు విధించారు. ఇప్పటికే అక్క‌డ 144 సెక్షన్‌ విధించడంతో పోలీస్‌ యాక్ట్‌ 30 అములులోకి వచ్చింది. దీంతో ఏ కార్యక్రమానికైనా పోలీసుల అనుమతి తప్పనిసరి. అయితే పోలీసులను రెచ్చగొట్టేందుకు జేసీ బ్రదర్స్ దీక్షకు సిద్ధమయ్యారు. తమపై అట్రాసిటీ కేసులు నమోదు చేయడం సరికాదంటూ జేసీ బ్రదర్స్‌ దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. ఇద్దరు దళితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆస్మిత్‌ రెడ్డిలపై ట్రాసిటీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేసుల నుంచి తప్పించుకునేందుకే జేసీ బ్రదర్స్‌ దీక్ష పేరుతో డ్రామాలు చేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. అట్రాసిటీ కేసును పరిష్కరించే వరకు… ఈ నెల 4 నుంచి తాడిపత్రిలో అమరణ దీక్ష చేస్తానని ప్ర‌క‌ట‌న తో స్థానికులు భ‌యాందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. అట్రాసిటీ కేసును రాజకీయంగా వాడుకుంటున్నారని తప్పుబడుతున్నారు.

ఇప్ప‌టికే అరెస్టులు.. దాడులు ప్రతి దాడులతో తాడిపత్రి అట్టుడికి పోతోంది. అటు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి.. ఇటు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి అనుచరుల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. అక్కడ సాదారణ పరిస్థితి రావడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమోదు అయింది. జేసీతో పాటు అనుచరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు 307సెక్షన్ కింద తాడిపత్రి వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ప‌రిస్థితుల్లో జేసీ ఆమ‌ర‌ణ దీక్ష ప్ర‌క‌ట‌న పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. త‌మ ప్రాభ‌వం కోసం ఇక్క‌డ అల్ల‌ర్లు సృష్టించ‌డ‌వ‌ద్ద‌ని కొంత మంది కోరుతున్నారు. ప్ర‌స్తుతం తాడిప‌త్రిలో అలాంటి కార్య‌క్ర‌మాలు అనుమ‌తి ఉండ‌ద‌ని తెలిసి పోలీసుల‌ను రెచ్చ‌గొట్టి మ‌రో వివాదం సృష్టించేందుకే జేసీ సోద‌రులు క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నారని వైసీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు.