iDreamPost
android-app
ios-app

‘నారాయణ’ లో విద్యార్థి ఆత్మహత్య

‘నారాయణ’ లో విద్యార్థి ఆత్మహత్య

నారాయణ విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. విజయవాడ రూరల్‌ మండలం నల్లకుంటలోని నారాయణ జూనియర్‌ కాలేజ్‌ హాస్టల్‌లో మంగళవారం ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన ఆటో డ్రైవర్‌ గట్ల శివకోటిరెడ్డి కుమారుడు రామాంజనేయరెడ్డి (16) నల్లకుంట నారాయణ క్యాంపస్‌లో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్నాడు. మంగళవారం రామాంజనేయరెడ్డి క్లాస్‌కు వెళ్లకపోవడంతో మధ్యాహ్నం 12.30 సమయంలో కాలేజీ సిబ్బంది హాస్టల్‌కు వెళ్లి చూడగా రూంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు. 

వెంటనే అతన్ని కిందకి దింపి గొల్లపూడిలోని ఆంధ్రా హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. విద్యార్థి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాలేజీ సిబ్బంది మృతుని తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం అందించారు. రామాంజనేయరెడ్డి మృతిపై అతని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి ఆంజనేయరెడ్డి ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపించాలని ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ధర్న చేశారు.