iDreamPost
iDreamPost
దేశంలోనే సమ్మిళిత అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ముందడుగు వేసింది. ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ కార్యక్రమాలు అందుకు మూల కారణంగా ఉన్నాయి. ప్రజా పంపిణీ వ్యవస్థ నుంచి నగదు బదిలీ వరకూ వివిధ కార్యక్రమాల విషయంలో ప్రభుత్వ చొరవ సత్పలితాన్నిస్తోంది. దేశంలోనే జగన్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో పెద్ద రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందు నిలిచింది 2018లో 10వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు 8వ స్థానానికి చేరుకుంది. పెద్ద రాష్ట్రాల్లో ఆరో స్థానంలో నిలిచి అభివృద్ధి పథాన సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్ లో పీడీఎస్ వ్యవస్థలో దేశంలోనే అత్యధికంగా 114 శాతం అభివృద్ధి సాధించింది. అమ్మ ఒడి సహా వివిధ సంక్షేమ చర్యల కారణంగా మరింత అభివృద్ధికి ఆస్కారం ఏర్పడింది. దాంతో తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, కేరళ, గుజరాత్, పంజాబ్ తర్వాత ఏపీకి చోటు దక్కింది. 2018లో 10 వస్థానం, 2019లో 8వ స్థానం, 2020లో 7 వస్థానంలో ఉండగా తాజా లెక్కల్లో ఓ స్థానం పైకి ఎదిగింది.
గ్రామీణ ప్రాంత పేదలు సహా అన్ని వర్గాల అభివృద్ధికి సమ ప్రాధాన్యతనివ్వడంతో ఈ సమ్మిళిత అభివృద్ధి సాధ్యమయ్యిందని ఇండియా టుడే గ్రూపు అభిప్రాయపడింది. ఆంధ్రప్రదేశ్ కన్నా ఈ విషయంలో తెలంగాణా, కర్ణాటక, మహారాష్ట్ర సహా అనేక రాష్ట్రాలు వెనుకబడి ఉండడం విశేషం. ఏపీ ప్రభుత్వం ఓవైపు పారిశ్రామికాభివృద్ధికి ప్రయత్నాలు చేస్తూనే, సంక్షేమ చర్యలకు ప్రాధాన్యతనివ్వడం ఈ ఫలితాలకు కారణమని ఆ సంస్థ అభిప్రాయపడింది.
ఆర్థిక పరిస్థితి పెద్దగా సహకరించకపోయినప్పటికీ విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యతనివ్వడం, సంక్షేమ పథకాలు అందరికీ అందించడం వంటి చర్యలు ఏపీని ముందంజలో నిలిపాయి. ఈ పథకాలు ఇదే రీతిలో కొనసాగిస్తే ఏపీకి మరింత మెరుగైన స్థానాలు ఖాయమని కూడా పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అప్పుల విషయంలో విపక్షాలు, జగన్ వ్యతిరేకులు నానా రాద్ధాంతం చేస్తున్నప్పటికీ కరోనా కాలంలో పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో పురోగతికి చేస్తున్న ప్రయత్నాలతో ఏపీ ఇతర రాష్ట్రాల కన్నా మెరుగైన ఫలితాలను దక్కించుకుంటుందని దేశస్థాయిలో నిపుణుల అభిప్రాయంగా వినిపిస్తోంది.
Also Read : New Districts- కొత్త జిల్లాలు ఎన్ని? ఎప్పుడు? సీఎం ప్రకటన తర్వాత మరోసారి చర్చ