iDreamPost
android-app
ios-app

సూర్య అవుట్ – సాయి ఇన్

  • Published Sep 14, 2020 | 6:11 AM Updated Updated Sep 14, 2020 | 6:11 AM
సూర్య అవుట్ – సాయి ఇన్

బిగ్ బాస్ 4కు సంబంధించిన ఎలిమినేషన్లు, వైల్డ్ కార్డు ఎంట్రీలు ఖచ్చితంగా లీకుల ప్రకారమే జరుగుతున్నాయి. ముందస్తుగా బయటికి వస్తున్న సమాచారంలో ఎలాంటి పొరపాటు జరగడం లేదు. దర్శకుడు సూర్య కిరణ్ అవుట్ కాగా కమెడియన్ కుమార్ సాయి పంపన ఇన్ అయ్యాడు. ఇతని పేరు చెబితే గుర్తుకు రాకపోవచ్చు కానీ మారుతీ తీసిన ఈ రోజుల్లో సినిమాలో నత్థి క్యారెక్టర్ తో పాపులారిటీ తెచ్చుకుంది ఇతగాడే. విలక్షణమైన కామెడీ టైమింగ్ తో ఆ తర్వాత కూడా చాలా సినిమాలు చేశాడు. తన ప్రవర్తనతో సూర్య కిరణ్ తన కొరివి తానే గోక్కున్నాడు. తనకన్నా చాలా చిన్నవాళ్ళైన మిగిలిన పార్టిసిపెంట్స్ ని డామినేట్ చేయాలనీ ప్రయత్నించడం బాగా నెగటివ్ గా మారింది.

అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ సూర్య కిరణ్ కేవో వ్యక్తిగత సమస్యలు ఉన్నాయని అందుకే అది హౌస్ లో కూడా ప్రభావం చూపించిందని వెళ్లిపోవడమే మంచిదని చెప్పడం గమనార్హం. హౌస్ లో ఉన్న పార్టిసిపెంట్స్ కి జంతువుల ఫోటోలు చూపించి ఒక్కొక్కరిని మ్యాచ్ అయ్యేలా చెప్పమని సూర్య కిరణ్ ని నాగ్ అడగటం కొంత వెరైటీగా ఉన్నా తమకొచ్చిన పేర్లను చూసి సభ్యులు పైకి నవ్వుతు కనిపించినా కొంత ఇబ్బంది పడిన మాట వాస్తవం. ఇక కుమార్ సాయి ఎలాంటి హడావిడి లేకుండా వచ్చేశాడు. దర్శకుడిగా నాగార్జునకో కథ చెప్పాలనే లక్ష్యాన్ని పనిలో పనిగా స్టేజి మీదే చెప్పేశాడు. మాములుగా గలగలా హడావిడిగా కలిసిపోతూ మాట్లాడే కుమార్ సాయి ఈ రోజు నుంచి ఏం హంగామా చేయబోతున్నాడో చూడాలి.

ఒకరు వెళ్ళిపోయి ఇంకొకరు వచ్చారు కాబట్టి మెంబర్స్ కౌంట్ లో ప్రస్తుతానికి ఎలాంటి మార్పు లేదు. ఫస్ట్ వీక్ షో గురించి చాలా యావరేజ్ రిపోర్ట్స్ రావడంతో రానున్న రోజుల్లో మరింత మసాలా జోడించేందుకు నిర్వాహకులు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. వివాదాలు లేనిదే బిగ్ బాస్ సక్సెస్ కావడం జరగదు. మరోవైపు గంగవ్వ ఎలాంటి హంగామా చేయకుండానే విపరీతమైన మద్దతు కూడగట్టుకుంటోంది. మిగిలిన వాళ్ళకు ఆన్ లైన్లో ఆ స్థాయి స్పందన ఇప్పటికైతే లేదు. పట్టుమని పది రోజులు కూడా కాలేదు కాబట్టి ఇప్పుడే ఓ అంచనాకు వచ్చేయడం కరెక్ట్ కాదు కానీ ఇప్పుడు జరుగుతున్న టైపులో నడిస్తే మాత్రం కష్టం. అసలే ఐపిఎల్ సీజన్ రాబోతోంది. మ్యాచులు పక్కనపెట్టి మరీ బిగ్ బాస్ చూడాలంటే కంటెంట్ మాములుగా ఉంటే సరిపోదు. మరి ప్రోగ్రాం డిజైనర్స్ దగ్గర ఎలాంటి స్ట్రాటజీలు ఉన్నాయో