కరోనా కారణంగా గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం విషమంగా ఉన్న విషయం తెలిసిందే. కాగా ఈరోజు ఉదయం నుండి తాజాగా చేసిన వైద్య పరీక్షల్లో ఎస్పీబికి కరోనా నెగెటివ్ అంటూ పలు ఛానెల్స్ మరియు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కాగా అవన్నీ అసత్య ప్రచారాలే అని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు ఎస్పీ చరణ్ వీడియో సందేశం ద్వారా వెల్లడించారు.
ఎస్పీ చరణ్ మాట్లాడుతూ నాన్న ఆరోగ్యం గురించి మొట్టమొదటిగా సమాచారం పొందే ఏకైక వ్యక్తి నేనేనని వెల్లడించారు. ఆ సమాచారాన్నే నేను మీడియాతో పంచుకుంటున్నానని, నాన్నగారికి కొవిడ్ నెగటివ్ వచ్చినట్లు ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి. కానీ నాన్నగారి ఆరోగ్యం విషయంలో ఎలాంటి మార్పు లేదని ఎస్పీ చరణ్ స్పష్టం చేశారు. ఇప్పటికీ ఆయనకు వైద్యులు వెంటిలేటర్, ఎక్మోసాయంతో చికిత్స అందిస్తున్నారని ఎస్పీ చరణ్ అన్నారు. కానీ ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని అందుకు సంతోషించాలని ఇదే కొనసాగితే ఆయన ఊపిరితిత్తులు మరింత కోలుకునే అవకాశం ఉందని తెలిపారు.
నాన్నగారి ఆరోగ్యం విషయంలో అసత్య ప్రచారాలు ఆపమని విజ్ఞప్తి చేసారు. వైద్యులతో చర్చించాక నేనే నాన్నగారి ఆరోగ్యం గురించి ఈరోజు సాయంత్రం నేనే అప్డేట్ ఇస్తా అని తెలిపారు. కాగా కరోనా కారణంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం విషయంలో ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ క్లారిటీ ఇవ్వడంతో ఉదయం సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలు అసత్య కథానాలే అని తేలిపోయింది.