iDreamPost
iDreamPost
వయస్సు వచ్చిన తర్వాత పనీపాటా లేకుండా, ఇంటిపట్టునే ఉండటం చాలామంది చిన్నతనమని అనుకొంటారు. పేరెంట్స్ సంపాదన మీద ఆధారపడటాన్నికూడా నామోషీగా చూస్తారు. కాని, ఈ అమ్మాయి పేరెంట్స్ తోపాటే ఉండటాన్నే ఉద్యోగంగా మార్చుకుంది.
ఆమె పేరు రోమా అబ్దెసెలామ్ , ఉండేది న్యూయార్క్ లో. ఫేమస్ టిక్‌టోకర్. మీరు ఏం చేస్తుంటారని అడిగితే, తనను తాను ప్రొఫెషనల్ ‘స్టే-ఇన్-హోమ్ డాటర్’ అని చెప్పుకొంటుంది. పేరెంట్స్ కష్టపడి సంపాదించిన డబ్బును ఖర్చు చేయడం నా ఫుల్ టైం జాబ్ అంటోంది.
రోమా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తెల్లవారు లేచిన దగ్గరనుంచి తాను కొన్న లగ్జరీ వస్తువులను ఫాలోవర్స్ కి చూపిస్తూనే ఉంటుంది. తన ఖరీదైన జీవితాన్ని ప్రదర్శిస్తుంది. ఆమె ఖరీదైన నగలు, బట్టలతో పెద్ద షాపే పెట్టుకోచ్చు. లేటెస్ట్ గా ఒకేరోజులో $50,000 (రూ. 39.49 లక్షలు) ఖర్చు చేసింది. ఏం కొన్నావని అడిగితే గూచీ, డియోర్, చానెల్ , ప్రాడాలో ఖరీదైనవాటిని కొందంట.
ఆమె పెరెంట్స్ సంపాదన ఎక్కువ. అందుకే వాళ్ల డబ్బును ఖర్చు పెట్టడమే తనకు ఉద్యోగమని, అదినాకు సరదాగా ఉంటోందని అంటోంది.
“ప్రతిరోజూ నేను ఉదయాన్నే నిద్రలేచి, బ్రేక్ ఫాస్ట్ తింటాను. వర్కవుట్ క్లాస్‌కి వెళ్తా. బెర్గ్‌డార్ఫ్‌లో నా ఫ్రెండ్స్ తో కలిసి షాపింగ్ చేస్తాను. అది నా నిరుద్యోగ జీవితమని మీడియాకు చెప్పింది. ఆమె జీవితంలో ఖర్చు తప్ప సంపాదన అన్నదే ఉండదు.
“కొన్ని రోజులు నేను £41,000 ($50,000) ఖర్చుచేస్తానని గర్వంగానే చెబుతుంది. ఇది రేర్ అని ఎవరు చెప్పినా కొనేస్తుందంట. మరి మీ పేరెంట్స్ ఏం చేస్తారని ఎవరు అడిగినా, స్పందించదు.
ఇంత విలాసవంతంగా ఖర్చు చేయడమేంటని కొందరు ఫ్యాన్స్ అడిగారు. దానికి నవ్వే ఆమె సమాధానం. అందుకే ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఆడగడం ఆపేసి, ఆమె చూపించే లగ్జరీ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారంతే.
ఇబ్బందిగా ఉంటుందని తలస్నానం చేయదు. ఎంత ఖరీదైన డ్రెస్ అయినా రెండోసారి వేసుకోదు.
ఇంట్లో ఉంటే మెయింటైన్ చేయడం కష్టంకాబట్టి, వాటిని డొనేట్ చేస్తుంది.