iDreamPost
iDreamPost
Rajamouli locks final cut, RRR: టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లు మొదలుకాబోతున్నాయి. ఈ నెల 29న టీజర్ తో పాటు త్వరలో నిర్వహించబోయే ఈవెంట్ల తాలూకు వివరాలు ప్రకటించబోతున్నారని ఇన్ సైడ్ టాక్. మొదటి ప్రీ రిలీజ్ వేడుక దుబాయ్ లో జరగబోతోందట. ఇప్పటికే నిర్మాత డివివి దానయ్యతో పాటు రాజమౌళి మరికొందరు కీలక సభ్యులు అక్కడి లొకేషన్ల వేటతో పాటు ఎలా చేయాలనే దాని మీద కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ తో పాటు అజయ్ దేవగన్ శ్రియ తదితరులు పాల్గొనేలా అందరికీ అనుకూలమైన డేట్ ను ప్లాన్ చేస్తున్నట్టు వినికిడి. తిరిగి వచ్చాక వీటికి సంబంధించిన క్లారిటీ వస్తుంది.
దుబాయ్ లో ఈవెంట్ అంటే రచ్చ మాములుగా ఉండదు. పైగా పాన్ ఇండియా సినిమా కాబట్టి తెలుగు వాళ్లే కాకుండా హిందీ తమిళ మూవీ లవర్స్ సైతం దీనికి హాజరవుతారు. కవరేజ్ కూడా ఇంటర్నేషనల్ లెవెల్ లో జరుగుతుంది. దీనికి గాను కోట్లలోనే ఖర్చు కాబోతోంది. ఎందరు వెళ్తారు అక్కడ ఏమేం ప్లాన్ చేశారు లాంటివి ఇంకా తెలియాల్సి ఉంది. ఇదయ్యాక ఇండియాలోని మెయిన్ సిటీస్ లో ఇదే తరహా ప్లానింగ్ జరుగుతుంది. రిలీజ్ టైంలో పోటీగా ఉన్న రాధే శ్యామ్ కంటే ఒక అడుగు ముందు ఉండేలా జక్కన్న టీమ్ పక్కా ప్లానింగ్ తో అన్నీ సిద్ధం చేస్తోందని చెబుతున్నారు. రెండు నెలలు అన్నిచోట్లా ఆర్ఆర్ఆర్ మాటే వినిపించేలా స్కెచ్ వేశారట.
థియేట్రికల్ బిజినెస్ నుంచే సుమారు మూడు వందల కోట్లకు పైగా టార్గెట్ చేసిన ఆర్ఆర్ఆర్ కు పరిస్థితులు అనుకూలంగా మారబోతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో సినిమా హాళ్లు తెరిచారు. జనం బాగానే వస్తున్నారు. వచ్చే నెల 5న సూర్యవంశీకి వచ్చే రెస్పాన్స్ ని బట్టి ఇంకా క్లారిటీ వస్తుంది. నార్త్ లోనూ ఆడియన్స్ బాగా వస్తున్నారు. ఆర్ఆర్ఆర్ కి ఇంకా రెండు నెలలకు పైగా టైం ఉంది కాబట్టి ఆలోగా ఇప్పుడున్న బజ్ ని రెట్టింపు చేసుకోవాలి. ఒకవైపు పుష్ప మరోవైపు రాధే శ్యామ్ ఈ రెండింటి మధ్య పబ్లిసిటీ ఫోకస్ తమ మీద ఉండేలా చేసుకోవడం అంత సులభం కాదు. ఇందులో రాజమౌళి నిష్ణాతుడు కాబట్టే ఫ్యాన్స్ నిశ్చింతగా ఉన్నారు.
ALSO READ – RC 15లో క్రేజీ అట్రాక్షన్స్