మలయాళ నటుడు శ్రీజిత్ రవిని, ఇద్దరు మైనర్ల ముందు తన జననాంగాలను ప్రదర్శించాడన్న ఆరోపణలపై అరెస్టు చేశారు. బాలికల ఫిర్యాదు మేరకు, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. సోమవారం తిస్సూర్లోని ఎస్ఎన్ పార్క్‌లో, శ్రీజిత్ ఇద్దరు బాలికల పట్ల ఆసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ మేరకు సీసీటీవీ పుటేజ్ ఆధారం దొరికింది. బాలికల వయసు 9, 14 ఏళ్లు
శ్రీజిత్ ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొవడం ఇది మొదటిసారి కాదు. 2016లో ఓట్టప్పలం పోలీసులు ఇలాంటి కేసులోనే అతడిని అరెస్ట్ చేశారు. విద్యార్దునుల గ్రూప్‌తో అసభ్యకరరీతిలో , ప్రైవేటు పార్ట్స్‌ను చూపిస్తూ ఫోటోలు షేర్ చేశాడు. కొందరు బాలికల ఫొటోలను తీసుకున్నాడు. స్కూల్ ప్రిన్స్‌పాల్ ఫిర్యాదుతో, పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను ప్రముఖ నటుడు టి.జి రవి కొడుకు. మాలీవుడ్ లో సహా కథనాయకుడిగా, విలన్‌గా నటించి గుర్తింపు పొందాడు. ఇప్పుడు శ్రీజిత్ పోలీసుల అదుపులో ఉన్నాడు.
80062