iDreamPost
android-app
ios-app

ప్చ్ లాభం లేదు – 7 రోజుల కలెక్షన్స్

  • Published Mar 18, 2021 | 9:43 AM Updated Updated Mar 18, 2021 | 9:43 AM
ప్చ్ లాభం లేదు – 7 రోజుల కలెక్షన్స్

ఎన్నో అంచనాలతో మహేష్ మహర్షి రేంజ్ లో ఆడేస్తుందనుకుంటే బ్రహ్మోత్సవం తరహాలో ఫలితం తప్పేలా లేదు శ్రీకారం సినిమాకు. టాక్ నెగటివ్ గా రాకపోయినా, మూవీ బాలేదని ఎవరూ అనకపోయినా ఇలాంటి పరిస్థితి రావడం మాత్రం విచిత్రమే. నిజానికి కాన్సెప్ట్ బాగున్నప్పటికీ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా దర్శకుడు కిషోర్ కంటెంట్ ని డెవలప్ చేసుకోకపోవడంతో ఫైనల్ గా లెక్కల ప్రకారం చూసుకుంటే ఇది డిజాస్టర్ దిశగానే వెళ్తోంది. ముఖ్యంగా ఏ సెంటర్స్ లోనూ రన్ చాలా వీక్ గా ఉండటం ఆందోళన కలిగించే విషయం. శర్వానంద్ ఫ్లాపుల హ్యాట్రిక్ కు బ్రేక్ పడుతుందనుకుంటే జరిగేలా కనిపించడం లేదు.

మొత్తం ఏడు రోజులకు కలిపి కష్టం మీద శ్రీకారం 9 కోట్ల షేర్ దాకా నెట్టుకొచ్చింది. అయితే బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకో 7 కోట్లకు పైగానే రావాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది జరగడం అసాధ్యంగానే తోస్తోంది. పైగా జాతిరత్నాలు రిజల్ట్ తో పాటు రేపు రాబోయే కొత్త సినిమాలు కూడా ప్రభావం చూపించబోతున్నాయి. రెండో వారంలోనూ చెప్పుకోదగ్గ స్థాయిలోనే స్క్రీన్లను కంటిన్యూ చేస్తున్నారు కానీ అవి ఎంత వరకు నష్టాల శాతాన్ని తగ్గిస్తాయనేది వేచి చూడాలి. ఏదైనా ఆశ ఉంటే అది రాబోయే వీకెండ్ మీద మాత్రమే.ఇక ఏరియాల వారీగా ట్రేడ్ నుంచి అందిన సమాచారం మేరకు వసూళ్లు ఈ విధంగా ఉన్నాయి

ఏరియా వారి మొదటి వారం వసూళ్లు :

ఏరియా  షేర్ 
నైజాం  2.72cr
సీడెడ్  1.56cr
ఉత్తరాంధ్ర  1.16cr
గుంటూరు  0.96cr
క్రిష్ణ  0.49cr
ఈస్ట్ గోదావరి  0.72cr
వెస్ట్ గోదావరి  0.49cr
నెల్లూరు  0.32cr
ఆంధ్ర+తెలంగాణా  8.42cr
రెస్ట్ అఫ్ ఇండియా 0.27cr
ఓవర్సీస్ 0.42cr
ప్రపంచవ్యాప్తంగా 9.11cr

ఇప్పుడు నష్టాలు రాకుండా బ్రేక్ ఈవెన్ చేరుకోవాలన్న శ్రీకారంకు అదో పెద్ద కొండలా కనిపిస్తోంది. ఫస్ట్ వీక్ టికెట్ ధరలు పెంచుకోవడం ఒకరకంగా మైనస్ అయ్యిందనే చెప్పాలి. కొద్దిరోజులు ఆగాక చూద్దాం అనుకున్న ప్రేక్షకులను అప్పటికే వచ్చేసిన డివైడ్ రిపోర్ట్స్ నిర్ణయం మార్చుకునేలా చేశాయి. ఇకపై ఈ విషయంలో నిర్మాతలు జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. శర్వానంద్ కు మంచి సినిమా చేశాడన్న పేరైతే వచ్చింది కానీ కమర్షియల్ లెక్కల్లో మాత్రం మరో ఫ్లాప్ చవిచూడక తప్పలేదు. 14 రీల్స్ బ్యానర్ కు సైతం ఇది నిరాశ కలిగించే ఫలితమే. రంగ్ దే వచ్చేదాకా ఇంకో వారం దాకా ఛాన్స్ ఉంది మరి. చూద్దాం