iDreamPost
iDreamPost
మొన్న శివరాత్రి పండక్కు అన్నిటికంటే ఎక్కువ బజ్ తో ప్రేక్షకుల్లో ఆసక్తి రేపిన శ్రీకారం కాన్సెప్ట్ పరంగా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్లు మాత్రం ఆశించిన స్థాయిలో లేకపోవడం షాక్ కలిగిస్తోంది. ఊహించని విధంగా జాతిరత్నాలు సెన్సేషన్ సృష్టిస్తున్నప్పటికీ కేవలం ఆ కారణంగా శ్రీకారం స్లో అయ్యిందని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఈ సినిమాకు దొరికిన స్క్రీన్లు, జరిగిన బిజినెస్ చాలా ఎక్కువ. కానీ జనం మాత్రం దీని వైపు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. సీరియస్ సబ్జెక్టుని అంతకంటే సీరియస్ గా డీల్ చేసి ఎక్కువ సందేశాలకు పరిమితమైన దర్శకుడు కిషోర్ టేకింగ్ హౌస్ ఫుల్స్ ని రాబట్టలేకపోతోంది.
సుమారు 17 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న శ్రీకారం ఇప్పటిదాకా 9 కోట్లు కూడా వసూలు చేయలేదు. టికెట్ ధరలు పెంచేయడం కొంత ప్రభావం చూపించిందన్నది వాస్తవం. మరోవైపు మిగిలిన మూడు సినిమాలు రెగ్యులర్ ధరలకే అమ్మడం కూడా ఎఫెక్ట్ ఇచ్చింది. ఆదివారం సెలవు కాబట్టి ఏదైనా అద్భుతం జరుగుతుందేమో అని ఎదురు చూసిన మేకర్స్ కు ఆశించిన ఫలితం దక్కలేదు. పర్వాలేదు అనిపించేలానే కలెక్షన్లు వచ్చాయి. గాలి సంపత్, రాబర్ట్ డిజాస్టర్ల అడ్వాంటేజ్ ని కూడా శ్రీకారం వాడుకోలేకపోయింది. ట్రేడ్ నుంచి అందిన సమాచారం మేరకు ఏరియాల వారిగా వసూళ్లు ఈ విధంగా ఉన్నాయి
– ఏరియా వారీగా శ్రీకారం మొదటి వారాంతం ఆంధ్ర తెలంగాణ కలెక్షన్స్
AREA | SHARE |
నైజాం | 2.30cr |
సీడెడ్ | 1.34cr |
ఉత్తరాంధ్ర | 1.06cr |
గుంటూరు | 0.92cr |
క్రిష్ణ | 0.43cr |
ఈస్ట్ గోదావరి | 0.66cr |
వెస్ట్ గోదావరి | 0.46cr |
నెల్లూరు | 0.30cr |
Total Ap/Tg | 7.55cr |
రెస్ట్ అఫ్ ఇండియా | 0.21cr |
ఓవర్సీస్ | 0.32cr |
ప్రపంచవ్యాప్తంగా | 8.10cr |
ఇప్పుడీ నెంబర్ లో భారీ మార్పులు రావాలంటే ఏదో మేజిక్ జరిగిపోవాలి. సెలవుల్లోనే జరగనిది వీక్ డేస్ లో అయిపోతుందనుకోవడం అత్యాశే. ఈ లెక్కన చూసుకుంటే బ్రేక్ ఈవెన్ అయినా సేఫ్ ప్రాజెక్ట్ గా మిగిలేది కానీ వరస చూస్తుంటే మాత్రం శర్వానంద్ కి మరో డిజాస్టర్ తప్పేలా కనిపించడం లేదు. కథల పరంగా ఎంత వైవిధ్యంగా ఉంటున్నా శర్వాను డీల్ చేస్తున్న దర్శకులు ప్రెజెంటేషన్ లో తడబడటంతో ఇలాంటి ఫలితాలు వస్తున్నాయి. ఈ శుక్రవారం మరో నాలుగు సినిమాలు రిలీజవుతున్నాయి. మరోవైపు జాతరత్నాలు స్లో కావడం లేదు లాంటి పరిణామాలు చూస్తే శ్రీకారం రికవరీ ప్రశ్నార్థకమే