వినయ విధేయ రామ వచ్చి రెండేళ్లు గడిచాక మెగా పవర్ స్టార్ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఈ ఏడాది రెండు రాబోతున్నాయి. మే 13న ఆచార్య, అక్టోబర్ 13న ఆర్ఆర్ఆర్ ఇలా కేవలం ఐదు నెలల గ్యాప్ లో ఫ్యాన్స్ కు పెద్ద పండగే ఇవ్వబోతున్నాడు. ఇదిలా ఉండగా ఇటీవలే దిల్ రాజు నిర్మాణంలో శంకర్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ప్రకటన వచ్చినప్పటి నుంచి దీని మీద సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు, చర్చలు మొదలయ్యాయి. ఎప్పుడు ప్రారంభిస్తారో ఇంకా క్లారిటీ రావడం లేదు కానీ పాన్ ఇండియా లెవెల్ ని దాటి పాన్ ఆసియా స్థాయిలో వివిధ భాషల్లో రూపొందింది పలు దేశాల్లో విడుదల చేసేలా ప్లానింగ్ జరుగుతోందట.
లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఇందులో సౌత్ కొరియన్ బ్యూటీ బే సుజీని తీసుకురాబోతున్నట్టు తెలిసింది. తను హీరోయినా లేక ఇంకెవరైనా తనతో పాటు చరణ్ తో ఆడి పాడతారా ఇంకా క్లారిటీ లేదు. కథ ప్రకారం ఓ విదేశీ భామ ఇందుకు అవసరమట. అందుకే శంకర్ వెతికి మరీ బే సుజీని సెట్ చేయబోతున్నట్టు సమాచారం. ఇదే తరహాలో ఆర్ఆర్ఆర్ లో జూనియర్ ఎన్టీఆర్ కోసం రాజమౌళి ఒలీవియా మోరిస్ ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తనతో షూట్ గుట్టుచప్పుడు కాకుండా పూర్తి చేశారు కూడా. ఇప్పుడీ అవకాశం చరణ్ కు దక్కబోతోందన్న మాట. అయితే పూర్తి డీటెయిల్స్ ఇంకా తెలియాల్సి ఉంది.
చరణ్ శంకర్ కాంబోకు సంబంధించిన బడ్జెట్ ఎంతో బయటికి రావాల్సి ఉంది. పాటలకే వందల కోట్లు ఖర్చు పెట్టే శంకర్ ని దిల్ రాజు ఎలా మేనేజ్ చేస్తారనే చర్చ ఫిలిం నగర్ సర్కిల్స్ లో ఉంది. అయితే తన రెగ్యులర్ స్టైల్ కి భిన్నంగా ఈ వేసవిలో మొదలుపెట్టి వచ్చే మార్చి లోగా పూర్తి చేసిబీ 2022 సమ్మర్ కి ఖచ్చితంగా విడుదల చేస్తనని శంకర్ మాట ఇచ్చారట. మరోపక్క ఆయన పూర్తి చేయాల్సిన ఇండియన్ 2 స్టేటస్ ఏంటో చెన్నై మీడియాకు సైతం అంతు చిక్కడం లేదు. నిర్మాణ సంస్థ లైకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. కమల్ హాసన్ మౌనం దీనికి మరింత బలం చేకూరుస్తోంది