iDreamPost
iDreamPost
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సర్ గంగారాం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. జులై 30 న సాధారణ పరీక్షల్లో భాగంగా సర్ గంగారం హాస్పిటల్లో సోనియా గాంధీ అడ్మిట్ అయిన విషయం తెలిసిందే. సాధారణ పరీక్షల అనంతరం సోనియాగాంధీ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు.
గతంలో సోనియాగాంధీ కడుపునొప్పితో బాధపడినప్పుడు ఇదే హాస్పిటల్ లో చికిత్స పొందారు. కాగా జులై 30 న సాయంత్రం ఏడు గంటలకు సాధారణ పరీక్షల నిమిత్తం సర్ గంగారం ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు సోనియాగాంధీ. కాగా డాక్టర్ అరూప్ కుమార్ బసు ఆధ్వర్యంలో జరిగిన పరీక్షల్లో సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగా ఉందని తేలింది. దీంతో సర్ గంగారం ఆసుపత్రి నుండి సోనియా డిశ్చార్జ్ అయ్యారు