iDreamPost
android-app
ios-app

సోలో రెండో రోజు కలెక్షన్లు – సేఫ్ & స్టడీ

  • Published Dec 27, 2020 | 6:48 AM Updated Updated Dec 27, 2020 | 6:48 AM
సోలో రెండో రోజు  కలెక్షన్లు – సేఫ్ & స్టడీ

శుక్రవారం విడుదలైన సోలో బ్రతుకే సో బెటరూ రెండో రోజు కూడా బాగానే పెర్ఫార్మ్ చేసింది. ఇంత గ్యాప్ తర్వాత వచ్చిన స్ట్రెయిట్ తెలుగు సినిమా కావడంతో ప్రేక్షకులు థియేటర్లకు చెప్పుకోదగ్గ నెంబర్ లోనే కదిలి వస్తున్నారు. టాక్ తో సంబంధం లేకుండా చాలా రోజుల తర్వాత దొరుకుతున్న ఎక్స్ పీరియన్స్ కావడంతో మంచి ఫిగర్లే నమోదవుతున్నాయి. యాభై శాతం సీటింగ్ తోనే అయినప్పటికీ వస్తున్న వసూళ్లు చూస్తుంటే నిర్మాతలు తీసుకున్న నిర్ణయం కరెక్టే అనిపిస్తుంది. మొదటి రోజు సుమారు 2 కోట్ల 80 లక్షల దాకా షేర్ రాబట్టిన సాయి తేజ్ మూవీ రెండో రోజు అంత దూకుడుగా లేకపోయినా 1 కోటి 90 లక్షలు రాబట్టి గుడ్ మార్క్ అందుకుంది. ఇక ఏరియాల వారీగా చూసుకుంటే సెకండ్ డే లెక్కలు ఇలా ఉన్నాయి.

Checkout area wise day 2 Collections

AREA SHARE
నైజాం  0.66cr
సీడెడ్  0.34cr
ఉత్తరాంధ్ర  0.32cr
గుంటూరు   0.15cr
క్రిష్ణ   0.13cr
ఈస్ట్ గోదావరి  0.14cr
వెస్ట్ గోదావరి  0.8cr
నెల్లూరు   0.8cr
2వ రోజు  ఆంధ్ర తెలంగాణా మొత్తం 1.90cr

పైన చెప్పిన షేర్ రెండో రోజు వచ్చిన 3 కోట్ల 30 లక్షల గ్రాస్ నుంచి తీసుకున్నది. ఇప్పటిదాకా వచ్చిన షేర్ ని చూస్తే మొత్తం 4 కోట్ల 80 లక్షలు వచ్చింది. అంటే బిజినెస్ టార్గెట్ చేరుకోవాలంటే ఇంకో 5 కోట్ల దాకా వస్తే అందరూ సేఫ్ అవ్వడంతో పాటు లాభాలు మొదలవుతాయి. ఇది అధికారిక లెక్కలు కానప్పటికీ ట్రేడ్ లో ఇవే చెలామణిలో ఉన్నాయి. ఈ రోజు ఆదివారం కాబట్టి కలెక్షన్లు భారీగా ఉండే అవకాశం ఉంది. బిసి సెంటర్లలోనూ చెప్పుకోదగ్గ స్థాయిలోనే బుకింగ్స్ జరుగుతున్నాయి. మరి సోమవారం నుంచి ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.