iDreamPost
iDreamPost
ఎన్నో అనుమానాల మధ్య తొమ్మిది నెలల గ్యాప్ తర్వాత తెరుచుకున్న థియేటర్లలో విడుదలైన సోలో బ్రతుకే సో బెటరూ ఆశించిన దాని కన్నా చక్కగా పెర్ఫార్మ్ చేస్తోంది. జీ ప్లెక్స్ జనవరి 1నే ఓటిటి ద్వారా రిలీజ్ చేసినా దాని ప్రభావం మరీ తీవ్ర స్థాయిలో పడినట్టు కనిపించడం లేదు. అయితే వీక్ డేస్ కలెక్షన్లు మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గిపోయాయి. టాక్ డివైడ్ గా ఉన్నా ఇప్పటికి గడిచిపోయిన తొమ్మిది రోజులకు గాను రెండు వీకెండ్స్ లో సాయి తేజ్ మంచి ఫిగర్స్ నమోదు చేశాడు. మొదట్లో ఉన్నంత దూకుడు ఇప్పుడు లేనప్పటికీ ఫైనల్ గా చూసుకుంటే 50 శాతం ఆక్యుపెన్సీకి, డిస్ట్రిబ్యూటర్లు చేసిన బిజినెస్ కు తగ్గట్టు లాభాలు వచ్చాయి. అధికారిక వర్గాల నుంచి కాదు కానీ ట్రేడ్ నుంచి వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ముందు ఏరియాల వారీగా ఇప్పటిదాకా వచ్చిన షేర్లను చూసుకుంటే ఈ విధంగా ఉన్నాయి.
Checkout area wise 10 days Collections
AREA | SHARE |
నైజాం | 3.51cr |
సీడెడ్ | 1.80cr |
ఉత్తరాంధ్ర | 1.39cr |
గుంటూరు | 0.83cr |
క్రిష్ణ | 0.57cr |
ఈస్ట్ గోదావరి | 0.83cr |
వెస్ట్ గోదావరి | 0.52cr |
నెల్లూరు | 0.47cr |
ఏపీ/ తెలంగాణ | 9.92cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.51 |
ఓవర్సీస్ | 0.37 |
ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు | 10.80cr |
మొత్తానికి టార్గెట్ పెట్టుకున్న 9 కోట్ల మార్క్ ని సోలో బ్రతుకే సో బెటరూ ఈజీగా దాటేసింది. ఇప్పుడు వస్తున్నదంతా లాభమే. ఇంకా సంక్రాంతి సందడి మొదలుకావడానికి అయిదు రోజుల సమయం ఉంది. అప్పటిదాకా ఎంత వస్తే అంతా పైన చెప్పినదానికి తోడవుతుంది. రవితేజ క్రాక్ నుంచి పండగ జోరు ఉంటుంది. సాయి తేజ్ కి ఇంకో వీకెండ్ అవకాశం దాదాపు లేనట్టే. బిసి కేంద్రాల్లో బాగా నెమ్మదించిన సోలో బ్రతుకు ఏ సెంటర్స్ లో శనిఆదివారాలు ఎక్కువగా రాబడుతోంది. గత ఏడాది ప్రతి రోజు పండగేతో ఇయర్ ఎండింగ్ చేసుకునం సాయి తేజ్ ఈ సంవత్సరం కూడా తన సినిమాతోనే మంచి క్లోజింగ్ ఇవ్వడం విశేషం.