అనంతపురం జిల్లాలోని ధర్మవరం మండలంలో దారుణ హత్యకు గురైన ఎస్‌బీఐ ఉద్యోగిని స్నేహాలత కేసులో పోలీసులు నిందితులు రాజేష్, కార్తీక్‌లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్యకు గల కారణాలను నిందితుల నుండి రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.నిందితులపై సెక్షన్ 302,మరియు అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ సత్యయేసుబాబు తెలిపారు.
బుధవారం సాయంత్రం బ్యాంక్‌నుండి ఇంటికి బయకదేరిన స్నేహలతను రాజేష్ అనే యువకుడు స్నేహితుని సాయంతో గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహంపై పెట్రోలు పోసి నిప్పంటించారు. కుమార్తె ఎంత సేపటికి ఇంటికి తిరిగి రాకపోవడంతో స్నేహలత తల్లిదండ్రులు అనంతపురం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా బడనపల్లె వద్ద స్నేహలత మృతదేహం ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ప్రేమ పేరుతో రాజేశ్ అనే యువకుడు తమ కుమార్తెను వేధించేవాడని అతడి స్నేహితుడు కార్తీక్‌తో కలిసి తమ కుమార్తెను హత్య చేసి ఉంటారని మృతురాలి తల్లి ఆరోపించడంతో పరారీలో ఉన్న రాజేష్ మరియు కార్తీక్ లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు..కార్తీక్ నుంచి నాలుగు సెల్ ఫోన్లు, అపాచి బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కాగా హత్యకు గురైన స్నేహలత కుటుంబాన్ని రాష్ట్ర మహిళ కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. దిశ చట్టం ద్వారా వారం రోజుల్లో ఛార్జ్‌షీట్ దాఖలు అవుతుందని, నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని వాసిరెడ్డి పద్మ బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు.