ఉన్నత చదువులు చదివి సరైన నైపుణ్యాలు లేక ఉద్యోగ వేటలో వెనుకబడుతున్న యువత కోసం ప్రభుత్వం నాణ్యమైన శిక్షణ ఇప్పించాలని నిర్ణఇంచింది. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జిల్లాకు మూడు చొప్పున 39 కేంద్రాలు ఏర్పాటు చేయాలని సంకల్పించింది.
నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఇలా..
– 13 జిల్లాల్లో 39 కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు సుముఖంగా ఉన్నారు. ప్రధానంగా ప్రభుత్వ కళాశాల్లలో ఈ కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించారు.
– నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో అకౌంట్స్, ఏరోస్పేస్ అండ్ ఏవియేషన్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, బ్యాంకింగ్ ఫైనాన్స్ అండ్ ఇన్‌స్రూ?న్స్, క్యాపిటల్ గూడ్స్, కెమికల్ అండ్ పెట్రో కెమికల్, కన్‌స్ట్రక్షన్, డొమెస్టిక్ వర్క్స్, ఎలక్ట్రికల్స్ ఇలా మొత్తం 51 రకాల స్కిల్ కోర్సుల్లో శిక్షణ ఇస్తారు.
– ఇంజనీరింగ్ విభాగాల్లో మరింత తెలుసుకునే విధంగా శిక్షణ, వివిధ రకాల వర్క్‌షాపులు ఉంటాయి.
– శిక్షణ అనంతరం ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తుంది.
– ఇప్పటికే పలు కాలేజీల్లో ఏర్పాటు కానున్న కేంద్రాల్లో కంప్యూటర్లు, ఇతర పరికరాలు ఉన్నాయి. వీటితోపాటు మరిన్ని పరికరాలు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
– కేంద్రాల్లో ఒక కోర్సు పూర్తి కాగానే మరో కోర్సులో విద్యార్థులను చేర్చుకుంటారు.
– మంచి ఫ్యాకల్టీ ద్వారా నిరంతరం శిక్షణ అందిస్తారు.