iDreamPost
iDreamPost
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షి గా రాష్ట్రం లోని వివిధ నియోజక వర్గాల నుండి ఎమ్మెల్యేలు గా ఎన్నికైన మహిళా ఎమ్మెల్యే లకు అన్నయ్య అయ్యారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న గురువారం నాడు అసెంబ్లీ లోని సీఎం కార్యాలయం లో సీఎం జగన్ వద్దకు వచ్చి రాఖీలు కట్టారు. ఈ సందర్భగా వారు సీఎం జగన్ పై తమ ఆప్యాయతను చాటుకున్నారు. దీని వెనుక గల కారణాలను ప్రస్తావిస్తే ఇటీవల హైదరాబాద్ నగర శివార్లలో జరిగిన దిశ సంఘటన కారణంగా చెప్పకతప్పదు. రాష్ట్రం లో మహిళల భద్రతకు తాను భరోసా ఇస్తానంటూ సీఎం జగన్ రెండు రోజుల క్రితం అసెంబ్లీ లో చట్టాన్ని తీసుకువచ్చారు. ఈ బిల్లు అసెంబ్లీలో ఏక గ్రీవంగా ఆమోదం పొందింది . అంతే కాకుండా రాష్ట్రంలోని మహిళలనుండి పెద్ద ఎత్తున హర్షం వ్యక్తమైంది.
గతం లో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా తమ రక్షణ కోసం ఈ రకమైన చట్టాలు తీసుకురావడంతో మహిళా ఎమ్మెల్యేలు స్పందించి కృతజ్ఞతగా గురువారం సీఎం జగన్ కు రాఖీలు కట్టి తమ ఆప్యాయతను చాటుకున్నారు. ఇప్పటి వరకు ఉన్న చట్టాల కంటే మరింత పదునుగా ఉన్న ఈ చట్టం ద్వారా ఎవరైనా మహిళలపై ఎవరైనా అఘాయిత్యాలకు పాల్పడితే అలాంటి వారికి 21 రోజుల్లో మరణ శిక్ష పడేలా చట్టాన్ని రూపొందించారు. ప్రత్యేకించి గతంలో మాదిరి తీవ్ర జాప్యం కాకుండా ఉండే వీలుగా ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఈ తరహా కేసులను విచారించేందుకు ఓ ప్రత్యేక కోర్టు ను ఏర్పాటు చేసే దిశగా కూడా అసెంబ్లీ సాక్షిగా సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ తరహా చట్టాలు రావడం ద్వారా మహిళలపై ఇప్పటి వరకు జరుగుతున్న అత్యాచారాలు పూర్తిగా నిరోధింపబడే ఆస్కారం ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. అంతే కాకుండా భిన్న సామాజిక మాధ్యమాలలో మహిళలను కించ పరుస్తూ ప్రకటనలు చేసినా, వారి మానానికి భంగం కలిగే విధంగా వ్యవహరించినా అలాంటి వారిపై శిక్షలు తీసుకునేలా ఈ చట్టం లో వెసులుబాటు ఈ చట్టంలో కల్పించడంతో గతంలో మాదిరిగా సామాజిక మాధ్యమాలలో కూడా మహిళలు అవమానపరిచేలా వేసే పోస్టింగ్ లకు చెక్ పడే అవకాశం ఉంది.