Idream media
Idream media
శివసేన ఎంపీ సంజయ్ రావుత్ భార్య వర్షా రౌత్‌కు ఈడీ సమన్లు జారీ చేయడం.. దీనికి నిరసన వ్యక్తం చేస్తూ శివసైనికులు సోమవారం ఈడీ కార్యాలయం ఎదుట ‘బీజేపీ ప్రదేశ్ కార్యాలయ్’ అని బ్యానర్ ఏర్పాటు చేయడం తెలిసిందే. ఆ బ్యానర్ వివాదం చినికి చినికి గాలివానల మారింది. బీజేపీ, శివసేన మధ్య మాటల యుద్ధం కాస్తా ఇప్పుడు బహిరంగ ఆందోళలకు దారి తీస్తోంది. పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంక్‌లో రుణ కుంభకోణంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్ పై కేసు నమోదైంది. ఈ మేరకు ముంబైలోని ఈడీ కార్యాలయంలో డిసెంబర్ 29న విచారణకు హాజరుకావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కొద్ది రోజుల క్రితం ఆమెకు సమన్లు జారీ చేసింది. మొత్తంగా ఆమెకు ఈడీ మూడు సార్లు సమన్లు జారీ చేసింది. తొలి రెండుసార్లు అనారోగ్య కారణాలు చూపుతూ ఆమె విచారణకు హాజరుకాలేదు. ఈ కేసులో నిందితుడు పవన్ రౌత్ భార్యకు, వర్షా రౌత్‌కు మధ్య 50 లక్షల రూపాయల నగదు లావాదేవీలకు సంబంధించి ఈడీ సమన్లు జారీ చేసింది.
మాటలు దాటి అంతకు మించి..
దీంతో శివసేన, బీజేపీల మధ్య కొనసాగిన మాటల యుద్ధం అనంతరం బ్యానర్లు ప్రదర్శించుకునే వరకు దారితీసింది. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్‌కు ఈడీ సమన్లు జారీచేయడంతో శివసైనికులు సోమవారం ఈడీ కార్యాలయం ఎదుట ‘బీజేపీ ప్రదేశ్ కార్యాలయ్’ అని బ్యానర్ ఏర్పాటు చేశారు. శివసేన భవన్ ఎదుట భారీ సంఖ్యలో పోగైన మహిళలు ఈడీ, బీజేపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకులపై ఈడీని ఉసిగోల్పుతోందని ఆరోపించారు. ఈ సందర్భంగా సంజయ్ రావుత్ సోమవారం విలేకరుల సమావేశంలో బీజేపీపై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఈడీ ద్వారా తమపై ఒత్తిడి తీసుకొచ్చి మహా వికాస్ ఆఘాడీ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తుందని రావుత్ ఆరోపించారు. సంవత్సర కాలం నుంచి తమను బెదిరిస్తూ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నుతున్నారని ధ్వజమెత్తారు. అందుకు ఈడీ, సీబీఐ అ్రస్తాన్ని ప్రయోగిస్తున్నారని అన్నారు.గత మూడు నెలల నుంచి బీజేపీ నాయకులు తరుచూ ఈడీ కార్యాలయానికి వెళుతున్నారని ఆరోపించారు. శివసేన, ఎన్సీపీలకు చెందిన 22 మంది ఎమ్మెల్యేల జాబితాను రౌత్ చూపించారు. వీరందరికీ నోటీసులు జారీ చేసి ఆ తరువాత అరెస్టు చేస్తామంటూ బెదిరించడమేగాకుండా ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసేలా కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.
ఆధారాల్లేకుండా నోటీసులు జారీచేయరు
ఈడీ, సీబీఐ అధికారులు ఎలాంటి ఆధారాలు లేకుండా అనవసరంగా ఎవరికీ సమన్లు, నోటీసులు జారీ చేయరని స్వాభిమాని పార్టీ చీఫ్ నారాయణ్ రాణే అన్నారు. రావుత్ భార్య వర్షాకు ఈడీ సమన్లు జారీచేయడాని సమరి్థంచారు. అనవసరంగా ఒకరిపై ఆరోపనలు, ప్రత్యారోపనలు చేయడానికి బదులు నేరుగా ఈడీ అధికారుల ఎదుట హాజరై సంబంధిత పత్రాలు చూపించాలని హితవు పలికారు. రుజువులు లేకుండా ఈడీ ఎవరికి నోటీసులు జారీ చేయదని రావుత్‌పై నారాయణ్ ధ్వజమెత్తారు. వారి వద్ద రుజువులున్నాయి కాబట్టి నోటీసు జారీచేశారని, బీజేపీ వ్యక్తిగత పనులకు ఈడీని వాడుకోబోదని, కేంద్రం ఆ«దీనంలో సీబీఐ, ఈడీ ఉంటుందనే విషయం రౌత్‌కు తెలియదా అని ప్రశ్నించారు.