iDreamPost
android-app
ios-app

మహాసముద్రంలో శర్వా : అఫీషియల్

  • Published Sep 07, 2020 | 7:43 AM Updated Updated Sep 07, 2020 | 7:43 AM
మహాసముద్రంలో శర్వా : అఫీషియల్

ఆరెక్స్ 100 లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ఇచ్చాక కూడా రెండేళ్ళకు పైగా గ్యాప్ తీసుకోవాల్సి వచ్చిన దర్శకుడు అజయ్ భూపతి ఎట్టకేలకు తన మహాసముద్రం సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు. సరిలేరు నీకెవ్వరు తర్వాత నిర్మాణ సంస్థ ఏకె ఎంటర్ టైన్మెంట్ నిర్మించబోయే మూవీ ఇదే. ఇందాకే అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చేశారు. శర్వానంద్ హీరోగా నటిస్తుండగా ఇందులో మరో కథానాయకుడు కూడా ఉంటాడని ఎప్పటి నుంచో టాక్ ఉంది. అతను ఎవరనేది మాత్రం ఇంకా బయట పెట్టలేదు. కొద్దినెలలగా రెండు మూడు పేర్లు వినిపిస్తున్నాయి కానీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రం లేదు.

సముద్రం బ్యాక్ డ్రాప్ లో ట్రయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందే మహాసముద్రంలో హీరోయిన్ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందట. ఒకరకంగా టైటిల్ ని అమ్మాయి మనసుతో పోలుస్తూ అలా సెట్ చేశారట. పాయింట్ అయితే ఆసక్తికరంగా ఉంది కానీ యాక్షన్ సెటప్ లో వయొలెన్స్ కూడా ఇందులో బాగానే ఉంటుందని సమాచారం. శర్వానంద్ ఇప్పుడు హిట్ కోసం చకోరా పక్షిలా ఎదురు చూస్తున్నాడు. పడి పడి లేచే మనసు, రణరంగం, జాను వరసగా హ్యాట్రిక్ డిజాస్టర్ల తర్వాత మార్కెట్ మీద కొంత ప్రభావం పడింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న శ్రీకారం లాక్ డౌన్ వల్ల తాత్కాలిక బ్రేక్ పడింది. త్వరలో పూర్తి చేసి విడుదలను నిర్ణయించబోతున్నారు.

రైతు సమస్యల మీద విభిన్నంగా తీసినట్టుగా ఇప్పటికే టాక్ ఉంది. ఇది కనక హిట్ అయితే మళ్ళీ బ్యాక్ టు ఫాం కావొచ్చు. మహాసముద్రం భారీ స్కేల్ మీదే రూపొందబోతోందని వినికిడి. గతంలో రామ్, నాగ చైతన్య, రవితేజ, సాయి శ్రీనివాస్ ఇలా అందరి దగ్గరికి వెళ్లి సబ్జెక్టు పరంగా వాళ్ళను మెప్పించి ఏవో కారణాల వల్ల డ్రాప్ అయిపోయి శర్వానంద్ దాకా వచ్చిన మహాసముద్రంలో అంత గట్టి మ్యాటర్ ఏముందో చూడాలి మరి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు దశల వారిగా ప్రకటిస్తామని ప్రెస్ నోట్ లో స్పష్టం చేశారు. మరి ఫ్లాపుల పరంపరలో ఉన్న శర్వానంద్ ని మహాసముద్రం ఎలా గట్టెక్కిస్తుందో చూడాలి. సెకండ్ హీరో సస్పెన్స్ మాత్రం ఇంకా కొనసాగుతోంది