iDreamPost
iDreamPost
వందల కోట్ల బడ్జెట్ తో ఏళ్లకేళ్లు సినిమాలను తీస్తూ పోవడం, చిన్న సీన్ నచ్చకపోయినా రీషూట్ల మీద రీషూట్లు చేయడంలో శంకర్ కున్న పేరు తెలిసిందే. ఈ పర్ఫెక్షన్ వల్లే ఒకప్పుడు అద్భుతమైన చిత్రాలు వచ్చాయి కానీ ఐ నుంచి ఆ స్థాయి అవుట్ ఫుట్ రావడం తగ్గింది. అంత హడావిడి చేసిన 2.0 కూడా కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో వసూళ్లు తీసుకురాలేదు. ఇక ఇండియన్ 2 సంగతి సరేసరి. క్రేన్ యాక్సిడెంట్ అయ్యాక అసలు ఇది ఉంటుందో లేదో కూడా ఎవరికి తెలియదు. కోర్టు మధ్యవర్తి ద్వారా నిర్మాణ సంస్థ లైకాతో ఉన్న వివాదం పరిష్కరించుకోమని చెప్పింది కానీ కమల్ హాసన్ కూడా దీని మీద ఆసక్తి వదిలేశాడు.
Also Read: ఇష్క్ మూవీ రిపోర్ట్
కానీ రామ్ చరణ్ తో చేయబోయే సినిమా తాలూకు పనులను మాత్రం శంకర్ శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. ఇప్పటికే థమన్ తో మ్యూజిక్ సిట్టింగ్స్ జరిగాయి. ఒక పాట కూడా రికార్డు చేశారట. మరోవైపు క్యాస్టింగ్ పూర్తి చేస్తున్నారు. ఇవాళ హీరోయిన్ గా కియారా అద్వానీని కన్ఫర్మ్ చేస్తూ దిల్ రాజు నిర్మాణ సంస్థ అఫీషియల్ గా ప్రకటన ఇచ్చింది. వినయ విధేయ రామ తర్వాత చరణ్ కియారా కలిసి చేస్తున్న మూవీ ఇది. అది డిజాస్టర్ అయ్యిందనే సెంటిమెంట్ అభిమానులను అనుమానపరుస్తున్నా సరైన కంటెంట్ పడితే అవే రివర్స్ అవుతాయి కాబట్టి దాని గురించి కొత్తగా టెన్షన్ పడాల్సిన పనిలేదు.
ఆచార్య, ఆర్ఆర్ఆర్ లు దాదాపుగా పూర్తయ్యాయి. మహా అయితే ఇంకో నెల రోజుల్లో రామ్ చరణ్ కంప్లీట్ గా ఫ్రీ అవుతాడు. శంకర్ సినిమాను వచ్చే వేసవిలోగానే పూర్తి చేసి ఆపై అపరిచితుడు హిందీ రీమేక్ వైపు వెళ్లాలని శంకర్ ప్లాన్ ఉన్నట్టుగా చెన్నై టాక్. రామ్ చరణ్ ఇందులో డ్యూయల్ రోల్ చేయొచ్చనే టాక్ ఉంది కానీ అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. చాలా కీలకమైన ఒక వయసు మళ్ళిన పాత్రను కూడా చరణ్ తోనే చేయించాలని చూస్తున్నారు కానీ లుక్ టెస్ట్ సక్సెస్ అయ్యిందో బయటికి రాలేదు. చూస్తుంటే అన్నీ సవ్యంగా కుదిరితే 2022 చివరి లోపు రామ్ చరణ్ మొత్తం మూడు సినిమాలతో పలకరించేలా ఉన్నాడు
Also Read: మళ్ళీ పెళ్లిలో రియల్ ట్విస్ట్