iDreamPost
android-app
ios-app

జగన్ లేఖ పై జాతీయ మీడియా ఏమంటుంది?

  • Published Oct 14, 2020 | 8:45 AM Updated Updated Oct 14, 2020 | 8:45 AM
జగన్ లేఖ పై జాతీయ మీడియా ఏమంటుంది?

ఆంధ్రప్రదేశ్ లో న్యాయవ్యవస్థ పనితీరుపై, సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు చంద్రబాబుకి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలపై, రాజధాని భూ కుంభకోణంలో జస్టిస్ ఎన్వీ రమణ కుమార్తెలు సైతం ఉన్నారంటు, అలాగే రాష్ట్ర హైకోర్టు వ్యవహారాల్లో ఎన్వీ రమణ జోక్యం చేసుకుంటున్నారంటు జగన్ ప్రభుత్వం సాక్ష్యాధారాలతో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే కు లేఖ రాయడం దేశ వ్యాప్తంగా పెను సంచలనం రేపింది.

సీఎం జగన్ రాసిన లేఖను మీడీయాకు విడుదల చేయడంతో ఎన్వీ రమణ కు చంద్రబాబు మద్య ఉన్న సన్నిహిత సంబంధాలు, అలాగే అమరావతి భూకుంభకోణం పై వారు ఎదుర్కుంటున్న ఆరోపణలు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా చర్చకు దారీతీసాయి. చంద్రబాబు కనుసన్నల్లో నడిచే తెలుగు మీడీయాలోని ఒక వర్గం ఈ వార్తపై తమ పేపర్ల లో కానీ, ఛానళ్ళ లో కాని ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వకపోయినా జాతీయ మీడియాలో మాత్రం ఈ అంశంపై తీవ్రమైన చర్చే జరిగింది.

నినటి రోజున ప్రముఖ జాతీయ న్యూస్ ఛానల్లో ప్రత్యేకంగా ఈ అంశంపై జరిగిన చర్చలో సుప్రీం కోర్టు మాజీ న్యాయ‌మూర్తి ఏకే గంగూలీ, సుప్రీంకోర్టు సీనియ‌ర్ న్యాయ‌వాది ప్ర‌శాంత్ భూష‌న్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ సీవీ మోహ‌న్‌రెడ్డి, మాజీ అడిషినల్ సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్‌ బిస్వ‌జిత్ భ‌ట్టాచార్య‌ పాల్గోని ఈ అంశంపై తమ అభిప్రాయాలను వెళ్ళడించారు. ఈ డిబేట్ లో పాల్గోన్న న్యాయ కోవిదుల్లో అధిక శాతం సీఎం జగన్ తీరును సమర్ధించడం గమనార్హం.

సుప్రీం కోర్టు మాజీ న్యాయ‌మూర్తి ఏకే గంగూలీ మాట్లాడుతూ ఒక ముఖ్యమంత్రి కాబోయే ప్రధాన న్యాయమూర్తి మీద అవినీతి ఆరోపణలు చేయడం చిన్న విషయం కాదని ఈ వ్యవహారం చూసీ చూడనట్టు వదిలేసే అంశం కాదని ముఖ్యామంత్రి రాసిన లేఖ పబ్లిక్ లోకి రావడం సహేతుకమా కాదా అనేది పక్కన పెడితే అందులో ఉన్న ఆరోపణల తీవ్రత దృష్ట్యా ఖచ్చితంగా విచారణ జరిపించాలని సుప్రీం ఈ అంశాన్ని ఖచ్చితంగా విచారణకు ఆదేశిస్తుందని తాను భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు.

మాజీ అడిషినల్ సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్‌ బిస్వ‌జిత్ భ‌ట్టాచార్య‌ మాట్లాడుతూ తాను ఇక్కడ ఎవరి తరుపునో వకాల్తా పుచ్చుకుని మాట్లాడటంలేదని , వ్యక్తులతో కేసులతో సంబంధం లేకుండా ఇలాంటి ధోరణి ప్రజల్లో న్యాయవ్యవస్థను పలుచన చేస్తుందని, ఇటువంటి చర్యలు మునుముందు ఉద్భవించకుండా చూసుకోవాలని ఇది అందరి బాధ్యత అని తన అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చారు.

అలాగే సుప్రీంకోర్టు సీనియ‌ర్ న్యాయ‌వాది ప్ర‌శాంత్ భూష‌న్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రాసిన లేఖ ప్రజల్లోకి వెళ్ళడంలో ఎటువంటి తప్పు లేదని , దీనిపై ప్రజల్లో కూడా చర్చ జరిగితే తప్పేంటని, ఇలాంటి వ్యవహారాలను ఎన్నిరోజులు గోప్యంగా ఉంచాతారని సుప్రీంకోర్టు సీనియ‌ర్ జ‌డ్జి ఎన్వీ ర‌మ‌ణ‌, టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు, మాజీ అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ ద‌మ్మాల‌పాటి శ్రీనివాస్‌ల మ‌ధ్య ఉన్న సంబంధం గురించి వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై ఖ‌చ్చితంగా విచార‌ణ జరిపించాలని, సుప్రీం లేదా హైకోర్టు రిటైర్డ్ జ‌డ్జిల‌తో మాత్ర‌మే దీనిపై విచార‌ణ జరిపించాలని, సిట్టింగ్ జ‌డ్జిల‌తో విచార‌ణ జ‌రిపితే నిష్ఫాక్షిక‌మైన తీర్పును మ‌నం ఆశించలేమని చెప్పుకొచ్చారు.

ఏదీ ఏమైన సీఏం జగన్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డేకు రాసిన లేఖ దేశ వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసిందనే చెప్పాలి. ఈ లేఖపై ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్న జస్టిస్ బాబ్డే ఈ వ్యవహారంపై ఎలా స్పందించి నిర్ణయం తీసుకుంటారనే అంశమే ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠగా మారింది.