దేశంలో కరోనా వైరస్ (కోవిడ్-19) విజృంభిస్తున్న నేపథ్యంలో స్కూల్స్, కాలేజీలతో పాటు విద్యా సంస్థల పున:ప్రారంభం పై చర్చలు జరుగుతున్నాయి. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్డీ) మంత్రి రమేష్ పోఖ్రియల్ నిశాంక్ ఆగస్టు 15 (స్వాతంత్ర్య దినోత్సవం) తరువాతే స్కూల్స్, కాలేజీలతో పాటు ఇతర విద్యా సంస్థలు ప్రారంభిస్తామని ప్రకటించారు. అయితే అంత వరకు ఆన్‌లైన్ కాస్లులు జరుగుతాయని పేర్కొన్నారు.
అయితే సిబిఎస్సీ జూలైలో పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేసింది. అయితే అవి జరుగుతాయా…లేదా అని చెప్పలేని పరిస్థితుల్లో సిబిఎస్సీ, కేంద్ర ప్రభుత్వం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం దేశంలో పరిస్థితి ఆ రకంగా ఉంది. అన్ లాక్ 1.0 ప్రారంభమైనప్పటి నుండి కరోనా కేసులు రోజు రోజుకు వేల సంఖ్యలో నమోదు అవుతున్నాయి. దేశంలో నాలుగు రాష్ట్రాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్‌లో కరోనా కేసులు, మరణాలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి.
ఇప్పటి వరకు దేశంలో 3,66,946 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ప్రపంచంలోనే కరోనా కేసులో భారత్ నాలుగో స్థానంలో ఉంది. దేశంలో ఇప్పటి వరకు 12,237 మంది కరోనా బారిన పడి మృత్యువాత పడ్డారు. దీంతో ప్రపంచంలో కరోనా మరమణాల్లో భారత్ ఎనిమిదో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో స్కూల్స్, కాలేజీలతో పాటు ఇతర విద్యా సంస్థలు పున: ప్రారంభం ప్రశ్నార్థకంగా మారింది.
పదో తరగతి పరీక్షలు కూడా చాలా రాష్ట్రాలు వాయిదా వేశాయి.
మధ్యప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి తదితర రాష్ట్రాలు పదో తరగతి పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాయి. మరికొన్ని రాష్ట్రాలు పదో తరగతి పరీక్షలు వాయిదా వేసేందుకు చర్చలు జరుపుతున్నాయి. అయితే కేరళ రాష్ట్రం మాత్రం కరోనా సవాళ్లను ఎదుర్కొని పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను ఇటీవలే నిర్వహించి సాహసోపేత చర్యలకు దిగింది. అందులో విజయవంతం అయ్యింది. కేరళ రాష్ట్రం వ్యాప్తంగా 14 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు. ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి విద్యార్థుల రవాణా సదుపాయం కల్పించింది. స్కూల్స్ అన్ని ప్రతి రోజు శానిటైజర్ చేసి పరీక్షలు నిర్వహించారు. అయితే ఏ విద్యార్థికి ఇబ్బంది తలెత్తకుండా నిర్వహణ చేశారు. ఒక స్కూల్ విద్యర్థిని కోసం బస్సు నడిపిన కేరళ సర్కార్ అనే వార్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ రకంగా విజయవంతంగా పరీక్షలు నిర్వహించింది.
అయితే పరీక్షలు ముగిసిన 14 రోజుల వరకు ఎటువంటి ప్రకటన చేయకుండా…ఒక విద్యార్థికి కరోనా సోక లేదని పరీక్షలు పూర్తి అయ్యి 14 రోజులు తరువాత కేరళ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే విద్యార్థులందరికి ఆన్‌లైన్ క్లాసులకు పక్క ప్రణాళిక వేసింది. కేరళలో సాధారణంగా జూన్ 1 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా విద్యా సంవత్సరం ప్రారంభించింది. అయితే అది ఆన్‌లైన్ ప్రారంభించింది. టివిలు, స్మార్ట్ ఫోన్లులో క్లాసులు నిర్వహిస్తున్నారు. స్మార్ట్ ఫోన్లు, టివిలు లేని ఇళ్లకు ప్రభుత్వమే అందించింది. ఆ విధంగా విద్యా సంవత్సరాన్ని కొనసాగిస్తుంది.
ఇప్పుడు స్కూల్స్, కాలేజీలు ఇతర విద్యా సంస్థల పున:ప్రారంభం అన్ని రాష్ట్రాలకు సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో కర్ణాటకలోని యడ్యూరప్ప ప్రభుత్వం ఏడాది పాటు స్కూల్స్ మూసివేతకు చర్చలు జరుపుతుంది. విద్యార్థుల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ఏడాది కాలం పాటు స్కూల్స్ మూసి వేసేందుకు కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకొనుందని చర్చలు జరుగుతున్నాయి. ఆన్‌లైన్ క్లాసు నిర్వహణ చేయకుండా ఇలా ఏడాది పాటు స్కూల్స్ మూసివేసేందుకే యడ్యూరప్ప ప్రభుత్వం యోచిస్తోంది.
ఈ నేపథ్యంలో కర్ణాటకలో మంగుళూరు జిల్లాలో ఒక ప్రైవేట్ స్కూల్ ఏడాది (అకాడమిక ఇయర్) పాటు స్కూల్ మూసి వేస్తున్నట్లు తెలిపింది. ప్రభుత్వానికి తమ మద్దతు ప్రకటిస్తున్నట్లు పేర్కొంది. కోవిడ్ -19 సంక్షోభం నేపథ్యంలో పాఠశాలల నిర్వహణ చాలా కష్టతరమని, తల్లి దండ్రులు, పిల్లల భద్రత గురించి ఆందోళన చెందుతూ దక్షిణ కన్నడలోని బెల్తాంగ్డి తాలూకాలోని రెసిడెంట్ పాఠశాల 2020-21 విద్యా సంవత్సరం స్కూల్ తెరవకూడదని నిర్ణయించింది. దీంతో కర్ణాటకలో స్కూల్స్ పున:ప్రారంభం ఇప్పట్లో లేదని, ఏడాది పాటు స్కూల్స్ మూసివేస్తారని మీడియాలో చర్చ జరుగుతుంది.