iDreamPost
android-app
ios-app

బ్రహ్మచారి బయోపిక్కులో బోలెడు ట్విస్టులు

  • Published Dec 19, 2020 | 5:54 AM Updated Updated Dec 19, 2020 | 5:54 AM
బ్రహ్మచారి బయోపిక్కులో బోలెడు ట్విస్టులు

టాలీవుడ్ ఎప్పుడూ చూడనంత సుదీర్ఘమైన లాక్ డౌన్ తర్వాత నేరుగా థియేటర్లలో విడుదలవుతున్న ఇమేజ్ ఉన్న హీరో సినిమా సోలో బ్రతుకే సో బెటరూ. ఈ నెల 25న తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో కూడా ఏక కాలంలో రిలీజవుతోంది. పోటీగా ఇంకేమి లేవు కాబట్టి ఓపెనింగ్స్ మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు డిస్ట్రిబ్యూటర్లు. ఇందాకా ట్రైలర్ విడుదల చేశారు. కథకు సంబంధించి క్లూలు కూడా ఇచ్చారు. అనగనగా ఓ యువకుడు(సాయి తేజ్). అతనికి పెళ్లంటే గిట్టదు. జీవితంలో మన హక్కులను కోల్పోయేలా చేసేది మ్యారేజే అన్నది తన నమ్మకం. నమ్మడమే కాదు అందరికీ దీనికి సంబంధించిన సూక్తులు చాగంటి రేంజ్ లో చెబుతుంటాడు.

అలాంటి అఘోర బ్రహ్మచారి జీవితంలోకి వస్తుంది ఓ అమ్మాయి(నభ నటేష్). అక్కడి నుంచి స్టోరీ అసలు మలుపులు తీసుకుంటుంది. ఎవరెవరో ఇతని లైఫ్ లోకి ప్రవేశిస్తారు. పరిస్థితి ఎక్కడి దాకా వెళ్తుందంటే ఇతన్ని అమితంగా ఇష్టపడిన యూత్ ఇతగాడి కటవుట్ లను నిలువునా తగలబెట్టేసే దాకా. అసలు ఇదంతా ఎలా జరిగింది, పెళ్లి వద్దనుకున్న ఆ కుర్రాడికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి, ఆటుపోట్లను ఎలా ఎదురుకున్నాడు అనేది తెరమీదే చూడాలి. ట్రైలర్ ఆసాంతం ఎంటర్ టైనింగ్ గా సాగింది. రెండు నిమిషాల లోపే ఉన్నప్పటికీ అంచనాలు రేకెత్తించేలా కట్ చేశారు.

ఎప్పటిలాగే సాయి తేజ్ మంచి ఎనర్జీతో కనిపించాడు. రాజేంద్ర ప్రసాద్, నరేష్, రావు రమేష్, సత్య, అజయ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. టైటిల్ కు తగ్గట్టే దర్శకుడు సుబ్బు దీన్ని ఓ బ్రహ్మచారి బయోపిక్కుగా తీర్చిదిద్దినట్టు కనిపిస్తోంది. మలుపులు కూడా చాలానే సెట్ చేశారు. తమన్ సంగీతం మరో ఆకర్షణ. మొత్తానికి ఇంత కాలం ఎదురు చూపుల తర్వాత థియేటర్లలోకి వస్తున్న తెలుగు సినిమాగా సోలో బ్రతుకే సో బెటరూ సరైన కంటెంట్ తోనే పలకరించేలా ఉంది. ట్రైలర్ లో చూపించిన ఎంటర్ టైన్మెంట్ తో సినిమాలో కూడా మెప్పిస్తే చాలు బాక్సాఫీస్ కి మళ్ళీ ఊపిరి వస్తుంది. దానికి ఇంకొక్క వారం ఎదురు చూడాలి మరి

Link Here @ http://bit.ly/38ivYRh