iDreamPost
android-app
ios-app

మొదటి రోజు కలెక్షన్లలో ‘సరిలేరు’ నీకెవ్వరూ

  • Published Jan 12, 2020 | 10:29 AM Updated Updated Jan 12, 2020 | 10:29 AM
మొదటి రోజు కలెక్షన్లలో ‘సరిలేరు’ నీకెవ్వరూ

సరిలేరు నీకెవ్వరూ చిత్రం బాక్సాఫీస్‌ను కొల్లగొట్టింది. సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు కథానాయకుడిగా, రష్మికా కథానాయకగా, లేడీ సూపర్‌స్టార్‌ విజయశాంతి, విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌ ముఖ్య పాత్రధారులుగా యవ దర్శకుడు అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరూ ఈ సంక్రాంతి సీజన్‌ పురస్కరించుకుని ప్రేక్షకుల ముందుకొచ్చింది.

భారీ అంచనాలతో థియేటర్లకు వచ్చిన సరిలేరు నీకెవ్వరూ నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. నిన్న శనివారం మొదటి రోజే 32.92 కోట్ల రూపాయలు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ మొత్తం కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కావడం విశేషం.

తెలగు చలన చిత్ర సీమలో ఇప్పటి వరకు విడుదలైన చిత్రాల్లో మొదటి రోజు అత్యధికంగా వసూలు చేసిన చిత్రాల జాబితాలో సరిలేరు నీకెవ్వరూ 4వ స్థానంలో నిలిచింది.

తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాల వారీగా కలెక్షన్లు.. కోట్లలో..

నైజాం – 8.65

సీడెడ్‌ – 4.15

ఉత్తరాంధ్ర – 4.58

గుంటూరు – 5.15

కృష్ణ – 3.07

ఈస్ట్‌ గోదావరి – 3.35

వెస్ట్‌ గోదావరి – 2.72

నెల్లూరు – 1.27
–––––––––––––––
మొత్తం – 32.92 కోట్లు
––––––––––––––

jojobet girişJojobet GirişCasibomivermectin tabletMadridbetMadridbetMadridbetmeritbetCasibom GirişmeritbetjojobetBetvolemarsbahis girişJojobet GirişJojobet Girişcasibom