iDreamPost
android-app
ios-app

సరిలేరు అనిపించుకుంది – క్లోజింగ్ కలెక్షన్స్

  • Published Mar 09, 2020 | 12:15 PM Updated Updated Mar 09, 2020 | 12:15 PM
  • Published Mar 09, 2020 | 12:15 PMUpdated Mar 09, 2020 | 12:15 PM
సరిలేరు అనిపించుకుంది – క్లోజింగ్ కలెక్షన్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా భారీ అంచనాల మధ్య విడుదలైన సరిలేరు నీకెవ్వరు దాదాపు అన్ని చోట్ల ఫుల్ రన్ పూర్తి చేసుకుంటోంది. ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు వచ్చేయడంతో పాటు జెమిని ఛానల్ లో అతి త్వరలో అని ప్రోమోలు రావడం మొత్తానికి దీని కలెక్షన్లను క్లైమాక్స్ కు తెచ్చేసింది. అల వైకుంఠపురములో నుంచి తీవ్రమైన పోటీ ఎదురుకున్న మహేష్ మూవీ దానికి ధీటుగా పోటీ ఇచ్చినప్పటికీ వసూళ్లలోనూ, ఫిఫ్టీ డేస్ సెంటర్స్ లోనూ సెకండ్ ప్లేస్ తో సర్దుకోక తప్పలేదు. అయితే మహేష్ కెరీర్ బెస్ట్ ఫిగర్స్ నమోదు కావడం పట్ల ఫ్యాన్స్ మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

ఇప్పటి పరిస్థితుల్లో ఏ సినిమా అయినా నాలుగైదు వారాలు ఆడటమే గొప్పనుకుంటున్న తరుణంలో సరిలేరు చక్కగా యాభై రోజులు పూర్తి చేసుకోవడం విశేషమే. లాభాల పట్ల బయ్యర్లు సైతం హ్యాపీగానే ఉన్నారు. ప్రధాన కేంద్రాలు మినహాయించి ఇప్పటికే సరిలేరు నీకెవ్వరుని రీ ప్లేస్ చేసేశారు. ట్రేడ్ నుంచి అందిన సమాచారం మేరకు సరిలేరు నీకెవ్వరు ఫైనల్ రన్ లో 124 కోట్ల 45 లక్షల షేర్ రాబట్టింది.

నైజామ్ లో మరోసారి సత్తా చాటిన మహేష్ అక్కడ 33 కోట్లకు పైగా రాబట్టడం విశేషం. వైజాగ్ 17 కోట్లకు పైగా షేర్ తో రెండో స్థానంలో నిలవగా సీడెడ్ 15 కోట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఓవర్సీస్ లోనూ 11 కోట్ల 50 లక్షలతో అక్కడా సరిలేరు బాగానే రాబట్టింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్త నిర్మాణంలో రూపొందిన సరిలేరు నీకెవ్వరు మహేష్ 26 సినిమాల కెరీర్లోనే బెస్ట్ గా నిలవడం ప్రిన్స్ ఫ్యాన్స్ ని ఆనందంలో ముంచెత్తింది. ఏరియాల వారిగా ఫైనల్ షేర్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

సరిలేరు నీకెవ్వరూ  ఫుల్ రన్ వసూళ్లు:

ఏరియా  షేర్ 
నైజాం  33.45cr
సీడెడ్  15.25cr
ఉత్తరాంధ్ర  17.50cr
గుంటూరు  8.90cr
క్రిష్ణ  7.85cr
ఈస్ట్ గోదావరి  9.95cr
వెస్ట్ గోదావరి  6.70cr
నెల్లూరు  3.65cr
ఆంధ్ర+తెలంగాణా  103.20cr
కర్ణాటక + ROI  9.75cr
ఓవర్సీస్  11.50cr
ప్రపంచవ్యాప్తంగా 124.45cr

Verdict: Block Buster

Jojobet GirişjojobetJojobetHoliganbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabet