iDreamPost
android-app
ios-app

మహేష్ నెవ్వర్ బిఫోర్ – ఫస్ట్ వీక్ కలెక్షన్స్

  • Published Jan 18, 2020 | 11:58 AM Updated Updated Jan 18, 2020 | 11:58 AM
మహేష్ నెవ్వర్ బిఫోర్ – ఫస్ట్ వీక్ కలెక్షన్స్

సరిలేరు నీకెవ్వరు సినిమాలో ప్రకాష్ రాజ్ చెప్పినట్టు సంక్రాంతి పండక్కు అల్లుడిలా కాకుండా మొగుడిలా వచ్చిన మహేష్ బాబు దానికి తగ్గట్టే మొదటి వారం దుమ్ము దులిపేశాడు. అల్లు అర్జున్ అల వైకుంఠపురములో నుంచి చాలా టఫ్ కాంపిటీషన్ ఫేస్ చేస్తున్న సరిలేరు నీకెవ్వరు బ్రేక్ ఈవెన్ కు దగ్గరలో ఉన్నట్టుగా వసూళ్ల లెక్కలు చెబుతున్నాయి. టీమ్ తరఫున ఇప్పటికే వంద కోట్ల షేర్ పేరుతో పోస్టర్లు వచ్చేశాయి. వరంగల్ లో జరిగిన సక్సెస్ మీట్ లో మహేష్ ఈ విషయాన్నీ స్వయంగా ప్రకటించాడు కూడా. ఇప్పటిదాకా వచ్చిన లెక్కల ప్రకారం సరిలేరు ఇప్పటిదాకా 92 కోట్ల పైగా రాబట్టినట్టు తెలిసింది.

ఈ నేపథ్యంలో రెండో వారం నుంచి సరిలేరు నీకెవ్వరు సత్తా ఎలా ఉండబోతోందన్న దాని మీదే ఫైనల్ ఫిగర్స్ ఆధారపడి ఉన్నాయి. సినిమా కంటెంట్ మీద డివైడ్ ఒపీనియన్ ఉన్నప్పటికీ మాస్ ఆడియన్స్ కి కావాల్సిన మసాలా కంటెంట్ ఉండటంతో పాటు సంక్రాంతి సెలవులను మహేష్ పూర్తిగా వాడేసుకున్నాడు. ఓవర్సీస్ లో మాత్రం కొంచెం నెమ్మదించిన సరిలేరుకు అసలు ఛాలెంజ్ రేపటి నుండి అంటే సోమవారం నుంచి మొదలుకానుంది. విశ్వసనీయ ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఏరియాల వారి వసూళ్లు ఈ విధంగా ఉన్నాయి.

ఏరియా వారి మొదటి వారం కలెక్షన్స్  

ఏరియా  షేర్ 
నైజాం  23.30cr
సీడెడ్  11.60cr
ఉత్తరాంధ్ర  10.60cr
గుంటూరు  7.20cr
క్రిష్ణ  5.80cr
ఈస్ట్ గోదావరి  7.25cr
వెస్ట్ గోదావరి  5.60cr
నెల్లూరు  3.02cr
ఆంధ్ర + తెలంగాణా మొత్తం  74.37cr
కర్ణాటక  + రెస్ట్ అఫ్ ఇండియా   8.25cr
ఓవర్సీస్   9.50cr
ప్రపంచవ్యాప్తంగా  92.12cr

మహేష్ చిత్రాల్లో ఆల్ టైం రికార్డు ( GST రిటర్న్స్ మినహా)

Jojobet GirişMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetcasibomcasibompokerklas giriş