iDreamPost
android-app
ios-app

సర్కారు విలన్ అర్జున్ కాదట

  • Published Jul 09, 2021 | 9:05 AM Updated Updated Jul 09, 2021 | 9:05 AM
సర్కారు విలన్ అర్జున్ కాదట

సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న మూవీగా సర్కారు వారి పాట మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా వల్ల ఇప్పటికే రెండుసార్లు బ్రేక్ పడిన ఈ సినిమా మరికొద్ది రోజుల్లోనే రీ స్టార్ట్ కాబోతోంది. ఇందులో విలన్ గా యాక్షన్ కింగ్ అర్జున్ నటించబోతున్నారనే ప్రచారం గత కొద్దిరోజులుగా జోరుగా సాగుతోంది. మహేష్ ఫ్యాన్స్ కొంత టెన్షన్ పడిన మాటా వాస్తవం. ఎందుకంటే ఆయన సెకండ్ ఇన్నింగ్స్ లో చేసిన స్ట్రెయిట్ తెలుగు సినిమాలేవీ పెద్దగా ఆడలేదు. అందుకే సర్కారు వారి పాట కూడా ఆ సెంటిమెంట్ ట్రాప్ లో పడుతుందేమో అనుకున్నారు.

కానీ లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఇందులో విలన్ గా సముతిరఖని నటించబోతున్నట్టు తెలిసింది. అర్జున్ పేరు కేవలం పరిశీలనకు మాత్రమే వచ్చిందని చాలా మాస్ గా నెగటివ్ క్యారెక్టర్ కి ఆయన సెట్ కారనే ఉద్దేశంతో పక్కనపెట్టినట్టు ఇన్ ఇన్ సైడ్ సోర్స్ నుంచి అందుతున్న సమాచారం. ఈ రెండు వార్తల్లో ఏదీ అధికారికం కానప్పటికీ సోషల్ మీడియాలో ఆల్రెడీ వైరల్ అయ్యే దిశగా పరుగులు పెడుతున్నాయి. క్రాక్ లో కటారి కృష్ణగా భయపెట్టిన సముతిరఖనికి డిమాండ్ చాలా భారీగా ఉంది. ఆర్ఆర్ఆర్ లోనూ ఆయన కీలక పాత్ర చేశారు. ఒకపక్క తమిళంలో బిజీగా ఉంటూనే ఇక్కడి మంచి అవకాశాలను వదులుకోవడం లేదు.

వచ్చే సంక్రాంతికి విడుదల లక్ష్యంగా పెట్టుకున్న సర్కారు వారి పాట ఆ టార్గెట్ అని అందుకునేందుకు కేవలం అయిదున్నర నెలల సమయం మాత్రమే ఉంది. ఆలోగా చేసేయొచ్చనే నమ్మకంతో దర్శకుడు పరశురామ్ తో పాటు ఎలాగైనా టార్గెట్ మిస్ కాకూడదని మహేష్ ఉన్నారట. అయితే పరిస్థితులు ఎప్పటికప్పుడు ఎవరి చేతుల్లోనూ లేకుండా పోతున్న తరుణంలో సర్కారు పండగ బరిలో ఉంటాడా లేదా అనేది ఆసక్తికరం. పైగా ఇదేమి బడ్జెట్ సినిమా కూడా కాదు. ఇంకా చాలా భాగం బాకీ ఉంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం మరో ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది

jojobet girişJOJOBET GİRİŞgamdomCasibomjojobetJojobet Giriş